Share News

తగ్గిన రేణుక ఎల్లమ్మ హుండీ కానుకల ఆదాయం

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:12 AM

భువనగిరి పట్టణ శివారులోని రేణక ఎల్లమ్మ ఆలయ హుండీ కానుకలను గురువారం లెక్కించారు. గత నాలుగు నెలలకు కలిపి రూ.3,66,625 ఆదాయం వచ్చింది.

తగ్గిన రేణుక ఎల్లమ్మ హుండీ కానుకల ఆదాయం
హుండీని లెక్కిస్తున్న భక్తులు

గతంతో నెలకు రూ.3 లక్షలు

ప్రస్తుతం నాలుగు నెలలకు రూ.రూ3.66 లక్షలు

భువనగిరి టౌన, మార్చి 21 : భువనగిరి పట్టణ శివారులోని రేణక ఎల్లమ్మ ఆలయ హుండీ కానుకలను గురువారం లెక్కించారు. గత నాలుగు నెలలకు కలిపి రూ.3,66,625 ఆదాయం వచ్చింది. అయితే గతంలో పోలిస్తే హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. తరచుగా హుండీ చోరీకి గురువుతుండడం, ఆలయ నిర్వాహకుల వైఖరితో హుండీల్లో కానుకలను వేసే భక్తులు తగ్గిన ఫలితంగానే ఆదాయం తగ్గినట్లు పలువురు భావిస్తున్నారు. గతంలో నెలకు హుండీల ద్వారా రూ.3 లక్షల ఆదాయం లభించగా తాజాగా నాలుగు నెలలకు కలిపి కేవలం రూ.3.66లక్షల ఆదాయం మాత్రమే లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవాదాయ జిల్లా ఇనస్పెక్టర్‌ సుమతి పర్యవేక్షణలో హుండీ కానుకలను లెక్కించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:12 AM