లైంగిక, వేధింపుల బాధితులకు భరోసా
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:11 AM
లైంగిక దాడులు, వేధింపులకు గురైన మహిళలు, బాలికల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒకచోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నాయి.

లైంగిక దాడులు, వేధింపులకు గురైన మహిళలు, బాలికల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒకచోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. అయితే బాధితుల కోసం ప్రత్యేక చట్టాలున్నప్పటికీ వారికి సరైన సలహా, భరోసా కల్పించేవారు కరువయ్యారు. ఈ క్రమంలో బాధితుల సహాయార్థం గత ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాలు మహిళలు, బాలికలకు మానసికంగా ధైర్యం, వైద్య సదుపాయం, న్యాయ సలహాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే సఖి కేంద్రాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాలను నిర్వహిస్తోంది. మూడేళ్ల కిందట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 317 కేసుల్లో బాధితులకు అండగా నిలిచారు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేటక్రైం)
సమాజంలో అన్యాయానికి గురైన మహిళలు, బాలికలకు పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదు మొదలుకొని వారికి న్యాయం జరిగే వరకు భరోసా కేంద్రం సేవలందిస్తోంది. కేసులు నమోదు విషయంలో తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని పోలీ్‌సస్టేషన్లలో చెప్పాలంటే కొంతఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో భరోసా కేంద్రంలో ఉండే మహిళా పోలీస్ అధికారి సమక్షంలో మహిళలు వారి బాధలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశముంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినపుడు న్యాయ సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్న వారికి భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. అనంతరం వారికి మనోధైర్యం కల్పించేందుకు సైకాలజిస్ట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ బాధిత మహిళలకు వైద్యసేవలు అవసరమైతే వెంటనే వైద్య సదుపాయం అందిస్తున్నారు. నిరాదరణకు గురైన వారికి ఆదరణ కల్పిస్తున్నారు.
మొత్తం మహిళలతోనే కేంద్రం నిర్వహణ
సూర్యాపేటలో మూడేళ్ల క్రితం రాష్ట్ర పోలీస్ మహిళా శిశు భద్రత విభాగం ఆఽధ్వర్యంలో భరోసా కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రంలో లీగల్ అడ్వయిజర్, సైకాలజిస్ట్, డెటాఎంట్రీ ఆపరేటర్, కేర్‌టేకర్, ఏఎనఎం, ముగ్గురు పోలీస్ అధికారులు, కౌన్సెలింగ్ సిబ్బంది మొత్తం కూడా మహిళలే ఉంటారు. ఈ కేంద్రం ఏర్పాటుకు స్థానిక సువెనలై్‌ఫ సైన్సెస్ ఆర్థికసాయం అందించింది. పట్టణ శివారులో సువెన లైఫ్ సైన్సెన కంపెనీ ప్రాంగణంలో సుమారు రూ.40లక్షలతో భరోసా కేంద్రానికి పక్కా భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అక్కడే సేవలందిస్తున్నారు.
317 కేసుల్లో సహకారం
సూర్యాపేట భరోసా కేంద్రానికి ఇప్పటివరకు 317 కేసులు వచ్చాయి. అందులో బాలలపై లైంగిక వేధింపులు, మిస్సింగ్ కేసులు 95, మెడికల్ సాయం అందించింది 80 మందికి, ఐదుగురికి పునరావాసం కల్పించడం, మరో 137 మంది బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాం
ఏదైనా సందర్భాల్లో అన్యాయానికి గురైన మహి ళలు, బాలికలకు భరోసా కేంద్రం ద్వారా ధైర్యం, పునరావాసం, న్యాయ సలహాలు అందిస్తున్నాం. సూర్యాపేట భరోసా కేంద్రంలో ఇప్పటికే 300 మందికి పైగా సేవలందించాం. మహిళల రక్షణ విషయంలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినపుడు నేరుగా డయల్-100 ఫోన చేయాలి.
- సనప్రీతసింగ్, ఎస్పీ, సూర్యాపేట