రాయరావుపేటకు పారిశ్రామిక శోభ
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:41 AM
పారిశ్రామిక ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్ మం డలానికి రాయరావుపేట ఇండస్ర్టియల్ పార్కు అదనపు ఆకర్షణ కానుంది.
ఇండస్ర్టియల్ పార్కులో ఊపందుకున్న నిర్మాణాలు
ఇప్పటికే మూడు కంపెనీల్లో ఉత్పత్తులు ప్రారంభం
నిరుద్యోగ యువతకు మెరుగవనున్న ఉపాధి అవకాశాలు
బీబీనగర్, జూలై 30: పారిశ్రామిక ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్ మం డలానికి రాయరావుపేట ఇండస్ర్టియల్ పార్కు అదనపు ఆకర్షణ కానుంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికతవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా అటు వైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులో రాయరావుపేట ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని భా వించింది. ఇందు కోసం 2019లో సర్వే నెంబర్ 12లో 39.7ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల స్థాపనకు స్వీకరించింది. పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలతో పాటు అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో 150మంది పారిశ్రామికవేత్త లు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన (టీఎ్‌సఐఐసీ) నుంచి భూముల ను కొనుగోలు చేశారు. అయితే 2021 వరకు ఇండసి్ట్రయల్ పార్కు స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పారిశ్రామిక వేత్తలు ఆందోళనలు సైతం చేపట్టారు. టీఎ్‌సఐఐసీ స్పందించి భూముల చదునుతోపాటు రోడ్లు వేసి విద్యుత లైన్లను ఏర్పాటు చేసింది. దీంతో ఇండస్ర్టియల్ పార్కులో భూములు కొనుగోలు చేసిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారు. పార్కులో 150 పరిశ్రమలకు గాను సుమారు 50పరిశ్రమలకు పైగా నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇందులో చాలా వరకు ని ర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే మూడు పరిశ్రమలు ఉత్పత్తిని కూడా మొదలు పెట్టాయి. మి గతా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు మొ దలు పెట్టారు. మరికొన్ని నెలల్లో కంపెనీల నిర్మాణా లు పూర్తి చేసుకుని ఉత్పత్తిని మొదలు పెడితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందనుంది.
మెరుగుపడనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాయరావుపేట ఇండస్ర్టియల్ పార్కులో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయ్యి, ఉత్పత్తిని ప్రా రంభించినట్లయితే వేలాది మంది నిరుద్యోగ యు వతీయువకులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నా యి. అంతే కాకుండా అనుబంధంగా ఎన్నో వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నా యి. ముఖ్యంగా సమీప పరిసర గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. దీంతో ఇక్క డి గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నాయి.