Share News

సంస్కృతి, సంస్కారానికి ప్రతీక రామ్‌రాజ్‌ కాటన వసా్త్రలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:01 AM

దేశ సంస్కృతికి, సంస్కారానికి రామరాజ్‌ కాటన వసా్త్రలు అద్దం పడతాయని మునిసిపల్‌ చైర్మన బురి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

సంస్కృతి, సంస్కారానికి ప్రతీక రామ్‌రాజ్‌ కాటన వసా్త్రలు
రామరాజ్‌ కాటన వసా్త్రల షోరూంను ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్మన శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ టౌన, ఏప్రిల్‌ 5 : దేశ సంస్కృతికి, సంస్కారానికి రామరాజ్‌ కాటన వసా్త్రలు అద్దం పడతాయని మునిసిపల్‌ చైర్మన బురి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో నూతనంగా ఆధునిక హంగులతో అత్యధిక డిజైన్లతో ఏర్పాటుచేసిన రామ్‌రాజ్‌ కాటన వసా్త్రల షోరూంను శుక్రవారం ఆయన మునిసిపల్‌ వైస్‌చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన శ్రీనివాస్‌రెడ్డి రామరాజ్‌ కాటన వసా్త్రలను కొనుగోలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రామరాజ్‌ కాటన వసా్త్రలు నాణ్యతకు మారుపేరని, పేరెన్నికగన్న రామరాజు కాటన వసా్త్రలు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. వివాహాది శుభకార్యాలకు నల్లగొండ పట్టణ ప్రజలు హైదరాబాద్‌ వంటి పెద్దపెద్ద నగరాలకు వెళ్లకుండా నల్లగొండలోనే కొనుగోలు చేసేలా షోరూమ్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రామ్‌రాజ్‌ కాటన వసా్త్రల షోరూంను జిల్లా ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మనలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డిని షోరూం నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో షోరూమ్‌ ఇనచార్జి రాకేష్‌, ఏరియా మేనేజర్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:01 AM