Share News

నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:12 PM

రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందించి, జూనలోపే రైతు రుణమాఫీ అమలుచేయాలని భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందించాలి
ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు

మోటకొండూరు, మే 29 : రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందించి, జూనలోపే రైతు రుణమాఫీ అమలుచేయాలని భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌కరు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజనలో రైతులకు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా జూనలోపే రైతు రుణమాఫీ చేసి కొత్త రుణాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి కళ్లెపు అడివయ్య, ఇక్కిరి సహదేవ్‌, దొంతిరి అంజిరెడ్డి, చిరబోయిన బాలయ్య,గడ్డం నాగరాజు, పంజాల మురళి, సిద్దేశ్వర్‌, సమరసింహరెడ్డి, ఇక్కిరి సిద్దులు, ఐలయ్య పాల్గొన్నారు.

ఆలేరు రూరల్‌ : ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆందోళనలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, నాయకులు సోమయ్య, అడవయ్య, సహదేవ్‌, బాల్‌రెడ్డి, అంజిరెడ్డి, సిద్దేశ్వర్‌, నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:12 PM