Share News

ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యత ప్రజాప్రతినిధులదే

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:25 AM

ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలదేనని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శనివారం జిల్లాకేంద్రంలోని టీఎ్‌సయూటీఎఫ్‌ కార్యాలయంలో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యత ప్రజాప్రతినిధులదే

ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేటఅర్బన్‌, జూన్‌ 1: ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలదేనని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శనివారం జిల్లాకేంద్రంలోని టీఎ్‌సయూటీఎఫ్‌ కార్యాలయంలో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు వారికి భరోసా కల్పిస్తే వారు తప్పక పిల్లలను ప్రభుత్వ పా ఠశాలలకు పంపుతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఏ.మంగ, ఆర్‌.ధనమూర్తి, పాపిరెడ్డి, సీహెచ్‌ రమేష్‌, డి.శ్రీనివాసాచారి, ఆర్‌.శ్రీను, శ్రీనయ్య, సైదా పాల్గొన్నారు.

కోదాడ: ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యార్థులను చేర్చించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పబ్లిక్‌క్లబ్‌ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉంటేనే పాఠశాలలయినా, కళాశాలలయినా ఉంటాయని, అందుకు ప్రజాప్రతినిధు లు కృష చేయాలన్నారు. 15 శాతం ఉపాధ్యాయులు, పనిచేయకుండా 60 శాతం మంది ఉపాధ్యాయులను చెడగొడుతున్నారని, దీంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. సమావేశంలో టీపీఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.మంగ, ఆర్‌.ధనమూర్తి, బి. వెంకటరమణ, పద్మ, సుధారాణి, పద్మావతి, నాగజ్యోతి, స్వరూప, శ్రీనివా్‌సరెడ్డి, వీరబాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

నేరేడుచర్ల: ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు, పౌరులు, రా జకీయ నేతలు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. శనివారం నేరేడుచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పౌరస్పందన వేదిక సభ్యులు పి. వెంకటరెడ్డి, క్రాంతి, పద్మావతి, అనిల్‌కుమార్‌, నర్సింహారావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:25 AM