దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో ఫొటోగ్రాఫర్ల నిరసన
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:00 AM
శుభకార్యానికి ఆర్డర్‌పై వెళ్లిన ఫొటోగ్రాఫర్ సెల్‌ఫోనలో ఫొటో తీయలేదని సంస్థాననారాయణపురం మండలం పుట్టపాకలో ఫొటోగ్రాఫర్ లింగస్వామిపై బంధువుల దాడిని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో పలుచోట్ల ఫొటోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు.

చౌటుప్పల్ టౌన, జూన 11 : శుభకార్యానికి ఆర్డర్‌పై వెళ్లిన ఫొటోగ్రాఫర్ సెల్‌ఫోనలో ఫొటో తీయలేదని సంస్థాననారాయణపురం మండలం పుట్టపాకలో ఫొటోగ్రాఫర్ లింగస్వామిపై బంధువుల దాడిని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో పలుచోట్ల ఫొటోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో ర్యాలీ అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన అధ్యక్షుడు తొర్పునూరి సాయిలుగౌడ్, ప్రతినిధులు మెట్టు రామచంద్రారెడ్డి, కందకట్ల కృష్ణ, దేశగోని రాజు, బొడిగే ప్రభాకర్, చంద్రశేఖర్, గణేష్, కాటం రాజు, రుషి, రాఘవేంద్ర, ప్రవీణ్, బలరాం, మహేష్, మధు, శంకర్, మధవాచారి, నిశాంత, రామకృష్ణ, పాల్గొన్నారు.
మోత్కూరు: స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఫొటోగ్రాఫర్ల నిరసనలో సంఘం మండల అధ్యక్షుడు చీమల వీరస్వామి, గుండు శ్రీనివాస్, గొడిశాల రాజయ్య, కోమటి జనార్ధన, కూరెల్ల విష్ణు, ఎడ్ల ప్రవీణ్, రాజశేఖర్, మహేష్, ప్రశాంత, శేఖరాచారి పాల్గొన్నారు.
మోటకొండూరు : స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ఫొటోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన మండల అధ్యక్షుడు లోడె చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు తిరుమల్, ప్రధానకార్యదర్శి మానెగళ్ల విక్రమ్, అద్దమడుగు నాగరాజు, భూమండ్ల శివకుమార్, బొజ్జ శంకర్, మానెగళ్ల శశి పాల్గొన్నారు.
భూదానపోచంపల్లి : పోచంపల్లిలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన జిల్లా ఉపాధ్యక్షుడు బోగ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి మక్తాల కృష్ణ, ఉపాధ్యక్షులు సీత శ్రవణ్, కేమ విష్ణు, ప్రతినిధులు రాయబండి వెంకటాచారి, గోదాసు శేఖర్, దొడ్డమోని వంశీధర్, చెక్క మల్లేష్, దోర్నాల నందు, కృష్ణానందం, పెండెం బాలలింగం, దోర్నాల రత్నం, గంజి రాజేష్ పాల్గొన్నారు.