Share News

100మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీకి ప్రతిపాదనలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:20 PM

చౌటుప్పల్‌ మండలంలో పలు పంటలకు సంబంధించి 100టన్నుల యూరియా, 100టన్నులు అడుగుమందు(డీజేపీ), 300మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమని ప్రభుత్వానికి చౌటుప్పల్‌ పీఏసీఎస్‌ ప్రదిపానలు పంపించింది.

100మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీకి ప్రతిపాదనలు

చౌటుప్పల్‌ ఎరువుల నిల్వలపై సమీక్షించిన ప్రభుత్వం

చౌటుప్పల్‌ టౌన, జూన 9: చౌటుప్పల్‌ మండలంలో పలు పంటలకు సంబంధించి 100టన్నుల యూరియా, 100టన్నులు అడుగుమందు(డీజేపీ), 300మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమని ప్రభుత్వానికి చౌటుప్పల్‌ పీఏసీఎస్‌ ప్రదిపానలు పంపించింది. మండలంలోని వ్యవసాయ పంటలకు ఉపయోగించే ఎరువులపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం సమీక్ష చేసింది. మండలంలో ప్రధానంగా రైతులు పత్తి, వరి సాగుతో పాటు కూరగాయలు, ఆకు కూరలను పండిస్తారు. గత సంవత్సరం 4,728 మంది రైతులు పత్తి సాగును 10,087 ఎకరాలలో , ఈ యాసంగిలో 8,729 మంది రైతులు వరి సాగును 17,555 ఎకరాలలో సాగు చేశారు. 160 ఎకరాలలో కూరగాయలు, ఆకు కూరలను పండించారు. ఈ పంటలను పరిగణలోకి తీసుకుని ఎరువుల వినియోగంపై అంచనాలను రూపొందించుటకు వ్యవసాయ శాఖ సమీక్షలను నిర్వహించింది. ప్రస్తుతం పీఏసీఎ్‌సతో పాటు ప్రైవేట్‌ దుకాణాల్లోఉన్న ఎరువుల నిల్వలపై అంచనా రూపొందించింది. రైతులకు ముందు ముందు ఎరువులు ఎంత మేరకు అవసరం ఉంటాయన్న వివరాలను వ్యవసాయ శాఖ రెండు రోజుల క్రితం ఏవో ముత్యాల నాగరాజు ద్వారా సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. కాగా ప్రభుత్వ నిబంధనల మేరకు పీఏసీఎ్‌సతో పాటు ప్రైవేటు ఎరువుల దుకాణాల్లోనూ ఒకే రేటుపై విక్రయాలు సాగుతాయి.

ప్రస్తుతం ఎరువుల నిల్వలు

పీఏసీఎస్‌ ప్రైవేట్‌ దుకాణాలు రైతు సేవా కేంద్రాలు

యూరియా 19.980 (మె.ట) 286.288( మె.ట) 44.950 (మె. ట)

డీఏపీ 38.700 (మె.ట) 34.450 (మె. ట) 9.850 ( మె. ట)

కాంప్లెక్స్‌ 25. 000 (మె.ట) 106.900( మె.ట) 18.900 (మె.ట)

ఎంఓపీ ------ 28.400 (మె.ట) ------

పీఏసీఎస్‌కు కేటాయించవలసిన ఎరువులు

పీఏసీఎ్‌సకు కేటాయించవలసిన ఎరువుల వివరాలను ఎవో నాగరాజు వ్యవసాయ శాఖ కు నివేదించారు. జూన చివరి నాటికి 100 మెట్రిక్‌ టన్నుల యూరియా, 100 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, జూలై చివరి నాటికి 300 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను పీఏసీఎ్‌సకు పంపించే ఏర్పాటు చేయాలని ఏవో సూచించారు. పీఏసీఎస్‌ తో పాటు ప్రభుత్వ లైసెన్సలు గల నాలుగు ప్రైవేట్‌ దుకాణాలతో పాటు మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేస్తారు. రైతుల అవసరాల మేరకు ప్రైవేట్‌ దుకాణాల యజమానులు సైతం తగినన్ని ఎరువులను అందుబాటులో ఉంచుతారని ఏవో తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 11:21 PM