Share News

రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:34 PM

జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు తక్షణ చర్య లు చేపట్టాలని రోడ్లు, భవనాలు, సాగునీటి శాఖ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ సచివాలయంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రు లు సమీక్ష నిర్వహించారు.

రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి

నల్లగొండ సాగునీటి ప్రాజెక్ట్‌లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం

మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నల్లగొండ, జనవరి 12: జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు తక్షణ చర్య లు చేపట్టాలని రోడ్లు, భవనాలు, సాగునీటి శాఖ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ సచివాలయంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రు లు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నల్లగొండ లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ లక్ష ఎకరాలకు సాగునీరందించే ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఎస్‌ఎల్‌బీసీ కాల్వలను పూర్తిచేసినప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేయలేదు. ఎస్‌ఎల్‌బీసీ కాల్వలకు, వరద కాల్వకు గత పదేళ్లనుంచి నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగాయన్నారు. వీటికి మరమ్మతులు చేపట్టాలని, ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద మొదటిదశలో 50వేల ఎకరాలకు, రెండో దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాల్వలను తవ్వే పనులను పూర్తిచేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్‌ బొజ్జ, ఈఎన్‌సీ మురళీధర్‌ రావు, చీఫ్‌ ఇంజనీరు అజయ్‌ కుమార్‌, డిప్యూటీ ఈఎన్‌ సీ జనరల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్

Updated Date - Jan 12 , 2024 | 11:34 PM