Share News

పంటల ప్రణాళిక సిద్ధం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:57 PM

ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వ్యవసాయశాఖ పంటల ప్రణాళికను రూపొందించింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 11లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తితో పాటు వివిధ పం టలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

పంటల ప్రణాళిక సిద్ధం

11లక్షల పైగా ఎకరాల్లో సాగు అంచనా

వరి, పత్తి పంటలకే పెద్దపీట

మే 3వ వారంలో వేసవి దుక్కుల్లో పత్తి వేసే అవకాశం

నల్లగొండ, ఏప్రిల్‌ 19: ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వ్యవసాయశాఖ పంటల ప్రణాళికను రూపొందించింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 11లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తితో పాటు వివిధ పం టలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలకరి వర్షాలకు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో అందుకు అనుగుణంగా వ్య వసాయశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఈ సారి కూడా వరి, పత్తి సాగుకే వ్యవసాయశా ఖ పెద్దపీట వేసింది. సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొనడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ విత్తనాలు, ఎరువులను ఆయా మండలాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తోం ది. గత ఏడాది అంతగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి యాసంగి వరి సాగుపై తీవ్ర ప్రభా వం చూపించింది. బోర్లు ఎండిపోవడంతో పాటు సాగునీరు అందక దిగుబడిపై ప్రభావం పడింది.

11లక్షలకు పైగా ఎకరాల్లో

ఈ వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో మొత్తం 11లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 5,19,160ఎకరాల్లో సాగు కానుండగా, 1,04,294 క్వింటాళ్ల వరి విత్తనాల ను అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 5.4 లక్షల ఎకరాల్లో సాగు కానుండగా, 15లక్షల విత్తనాల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. కం దులు 4,710ఎకరాల్లో సాగు చేయనుండగా, 1,413క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచనున్నారు. పెసర్లు 1,468 ఎకరాల్లో సాగు కానుండగా, 1,017క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. మినుములు 946ఎకరాల్లో సాగు కానుండగా, 756 క్వింటాళ్ల విత్తనాలు, జొన్నలు 185ఎకరాల్లో సాగుకానుండ గా, 74క్వింటాళ్ల విత్తనాలు, సజ్జలు సాగు అంచనా 35ఎకరాలు కాగా, 7క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. వేరుశనగ 1,145ఎకరాల్లో సాగు కానుండగా, 6.87క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయనున్నారు. పచ్చిరొట్ట కు సంబంధించి జీలుగ 56,030ఎకరాల్లో సాగు కానుండ గా,6,723క్వింటాళ్ల విత్తనాలు, జనుము 15,440ఎకరాల్లో వే యనుండగా 2,448క్వింటాళ్ల విత్తనాలు, పిల్లిపెసర 8,835 ఎకరాల్లో సాగుకానుండగా,365క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది.

మే మూడో వారంలో పత్తి విత్తనాలు

ఈ ఏడాది మే మూడో వారంలో రైతులు వేసవి దుక్కుల్లో పత్తి విత్తనాలు వేసే అవకాశం ఉంది. మే నెలాఖరున ఆడపాదడపా ముందస్తుగా వర్షాలు, లేదం టే జూన్‌ మొదటి వారంలో మృగశిర కార్తె నాటికి తొలక రి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వేసవి దుక్కుల్లో ముందుగానే పత్తి విత్తనాలు పెడితే పత్తి చే ను ఏపుగా పెరగడంతో పాటు దిగుబడులు అధికంగా వస్తాయని రైతులు ముందస్తు విత్తనాలు వేస్తారు. ఈ నేపథ్యంలో పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉం చాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ సారి మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తు న్న విషయంలో రైతులు వానాకాలం సీజన్‌లో పత్తి సాగును ముందస్తుగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. యాసంగిలో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ఈ వానాకాలం సీజన్‌ కలిసి వస్తుందని వాతావరణశాఖ అంచనాల ప్రకారం రైతులు ఆశలు పెంచుకున్నారు.

వానాకాలం సీజన్‌కు సన్నద్ధంగా ఉన్నాం : టి.శ్రవణ్‌కుమార్‌, నల్లగొండ జేడీఏ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్ల ను పూర్తి చేశాం. 11లక్షలకు పైగా ఎకరా ల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి వరి, పత్తి విత్తనాలతో పా టు పప్పు దినుసులు, ఇతర విత్తనాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసి ఉంచుతాం. అదేవిధంగా ఎరువులు కూడా అం దుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. వర్షాలు ప్రా రంభానికి ముందే యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం విత్తనాలు, ఎరువులు సమృద్థిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Apr 19 , 2024 | 11:57 PM