ఎస్సీ కార్పొరేషన చైర్మనగా ప్రీతం
ABN , Publish Date - Jul 09 , 2024 | 12:40 AM
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతం ఎస్సీ కార్పొరేషన చైర్మనగా నియమితులయ్యా రు.
మోత్కూరు, జూలై 8: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతం ఎస్సీ కార్పొరేషన చైర్మనగా నియమితులయ్యా రు. ఈ ఏడాది మార్చి 17నే నియమించినా పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు.
విధేయతకు దక్కిన ఫలితం
ప్రీతం రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉన్నా రు. ఆయన కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడినా టికెట్ దక్కలేదు. 2021 జూనలో అడ్డగూడూరులో జరిగిన మరియమ్మ లాక్‌పడెత సంఘటనపై పోరాడారు. అప్పటి అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి బాధిత కుటుంబానికి తగిన ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి, ఆ సంఘటనకు కారకులైన ఎస్‌ఐని, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి తొలగించే వరకు వదల్లేదు. ఎంఏ ఎల్‌ఎల్‌బీ చేసిన ప్రీతం 2005నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన ఎల్‌డీఎమ్మార్సీలో దేశవ్యాప్తంగా 50 ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంటు స్థానాలకు ఇనచార్జిగా పనిచేశారు. 2020 నుంచి టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మనగా, 2023 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారు.
ఉద్యమ నేతకు దక్కిన గౌరవం
ఆలేరు రూరల్, జూలై 8: మహిళా సహకార అభివృద్ధి సంస్ధ (రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన) చైర్‌పర్సనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బండ్రు శోభారాణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1972 జూలై 20వ తేదీన మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శోభారాణి ఆలేరుకు చెందిన బండ్రు భాస్కర్‌ను జనశక్తి ఉద్యమ పార్టీలో పనిచేస్తున్న క్రమంలోనే వివాహం చేసుకున్నారు. 1985లో ఆమె సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో పనిచేశారు. మావోయిస్టుగా ఉన్న ఆమె 2001లో నారాయణపేట జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2002 నుంచి 2004 వరకు బీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2005లో టీడీపీలో చేరి ఆ పార్టీలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకం చేసిన తెలంగాణ ఐక్య వేదికలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆమె 2022 డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవ చేయడంతో పాటు ప్రజలందరి లో ఐక్యతను పెంపొందించడమే తన ముందున్న లక్ష్యమన్నారు.
పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మనగా రమేష్‌రెడ్డి
సూర్యాపేటటౌన, జూలై 8: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అబివృద్ది సంస్థ చైర్మనగా పటేల్ రమేష్‌రెడ్డి సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అబివృద్ధి చేయడంలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు. పర్యాటక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించి మౌళిక సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యాటకు లకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
రాజకీయ నేపథ్యం : 1995లో బాలెంల సర్పంచ, 2001లో బాలెంల ఎంపీటీసీ, 2006లో భార్య లావణ్య జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.
పదవులు: 2000-2012 వరకు టీడీపీ మండల అద్యక్షుడు, 2012 నుండి 2014వరకు సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జీ, 2014లో ఎ మ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ, 2016-2017 వరకు టీడీపీ జిల్లా అధ్యకుడిగా పని చేశారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. 2018లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, 2022లో టీపీసీసీరాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా నియామకం.
నిరుద్యోగులకు బాసటగా నిలిచిన వీరయ్య
హుజూర్‌నగర్, జూలై 8: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముత్తినేని వీరయ్య వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ముత్తినేని వీరయ్య 2014 నుండి నేటివరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంఘం సెల్ రాష్ట్ర ఛైర్మన్‌గా ఉన్నారు. గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంకు చెందిన గురవయ్య, భారతమ్మల ప్రథమ కుమారుడైన వీరయ్య మిర్యాలగూడ, హైద్రాబాద్‌లలో శ్రీరామనుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించారు. వీరయ్యకు భార్య మాధవి, కుమార్తె శ్రీవత్సల, కుమారుడు ఈశ్వరచంద్రవరప్రసాద్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం లోని అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేశారు. విజయసంకల్ప యాత్ర టూర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పార్లమెంట్ స్థానాల్లో 46రోజుల పా టు ప్రచారం నిర్వహించారు. వితంతువులు, కల్లుగీత కార్మికులు, పెరిక కులస్తులు, నిరుద్యోగులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి వీర య్య తనవంతు పాత్ర పోషించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సెల్ అధ్యక్షుడిగా ఉన్న ముత్తినేని వీరయ్యను కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ముత్తినేని వీరయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ఎంతో నమ్మకంతో పెద్ద బాధ్యతను అ ప్పగించిందన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.