Share News

సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజావాణి’

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:25 AM

గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల సత్వర పరిష్కారం కోసమే పంచాయతీల స్థాయిలో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన మాట్లాడారు. వానాకాలం అయినందున సీజనల్‌ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజావాణి’
ప్రజావాణిలో బాధితులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర

అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర

వేములపల్లి, జూలై 4: గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల సత్వర పరిష్కారం కోసమే పంచాయతీల స్థాయిలో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన మాట్లాడారు. వానాకాలం అయినందున సీజనల్‌ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంక్‌లను శుభ్రంచేసి వీధుల వెంట బ్లీచింగ్‌ చల్లించాలన్నారు. గ్రామస్థాయి నోడల్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శి, హెల్త్‌ సిబ్బంది, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని వైద్యసిబ్బంది అవసరమైన మందులను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. అధికారులు ‘ప్రజావాణి’లో సకాలంలో పాల్గొని ప్రజల దరఖాస్తులు తీసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ‘ప్రజావాణి’పై నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివా్‌సరావు, ఎంపీడీవో శారదాదేవి, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌, ఏఎన్‌ఎం శైలజ, ఎఫ్‌ఏ తులసీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:25 AM