Share News

చెరువులను సాగర్‌ నీటితో నింపాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:39 AM

సాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని చెరువులను, కుంటలను సాగర్‌ నీటితో నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చెరువులను సాగర్‌ నీటితో నింపాలి
ఎడమకాల్వపై ధర్నా చేస్తున్న సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ నాయకులు

గరిడేపల్లి, ఏప్రిల్‌ 4: సాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని చెరువులను, కుంటలను సాగర్‌ నీటితో నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని వెలిదండ గ్రామంలో సాగర్‌ ఎడమకాల్వపై సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్‌ అయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపి భూగర్భజలాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆయకట్టు కింద గ్రామాలు తాగునీటికి అల్లాడుతుంటే కాల్వపై పోలీసులను పెట్టి ఖమ్మం జిల్లాకు నీటిని తరలించడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముల్కలపల్లి రాములు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ నాయకులు పోటు లక్ష్మయ్య, మేకల కనకారావు, సైదులు, బ్రహ్మం, నాగేష్‌, గోపీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:39 AM