పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరలు అద్భుతం
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:47 AM
పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ పట్టుచీరల డిజైన్లు అత్యద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్యాటకులు జాన్ రాబర్ట్ దంపతులు కితాబు ఇచ్చారు. సోమవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించిన జాన్ రాబర్ట్ దంపతులు ఇక్కడి చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు.
ఇంగ్లాండ్ దేశ పర్యాటకులు జాన్ రాబర్ట్ దంపతులు
భూదాన్‌పోచంపల్లి, జనవరి 29: పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ పట్టుచీరల డిజైన్లు అత్యద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్యాటకులు జాన్ రాబర్ట్ దంపతులు కితాబు ఇచ్చారు. సోమవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించిన జాన్ రాబర్ట్ దంపతులు ఇక్కడి చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు. చేనేత టైఅండ్‌డై ఇక్కత్ పట్టుచీరల తయారీ ప్రక్రియలను పరిశీలించి, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు విశ్వ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు. చేనేత కళాకారులు రూపొందించిన డిజైన్లను చూసి ప్రశంసించారు. భారత్ పర్యటనలో భాగంగా వారు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. వారికి పోచంపల్లి చేనేత వస్త్ర కళాకారుడు సాయిని భరత్ మార్గదర్శనం చేశారు.