పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ఖండాంతర ఖ్యాతి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:45 PM
పోచంప ల్లి చేనేత టైఅండ్‌డై సిల్కు చీరలకు ఖండాంతర ఖ్యాతి ఉందని విదే శీ పర్యాటకులు కితాబిచ్చారు. కొలంబియా దే శానికి చెందిన తొమ్మిది మంది విదేశీ పర్యాటకు ల బృందం బుధవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించింది.

భూదాన్‌పోచంపల్లిని సందర్శించిన విదేశీ పర్యాటకుల కితాబు
భూదాన్‌పోచంపల్లి, మార్చి 6: పోచంప ల్లి చేనేత టైఅండ్‌డై సిల్కు చీరలకు ఖండాంతర ఖ్యాతి ఉందని విదే శీ పర్యాటకులు కితాబిచ్చారు. కొలంబియా దే శానికి చెందిన తొమ్మిది మంది విదేశీ పర్యాటకు ల బృందం బుధవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించింది. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత యూనిట్లను సందర్శించారు. అనంతరం రూరల్ టూరిజం సెంటర్‌లోని మ్యూజియం సందర్శించారు. మ్యూజియంలోని ‘లీవ్‌టుక్లాత్’ ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించారు. వారి జీవన స్థితిగతులను, చేనేత పరిశ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్ర త యారీ ప్రక్రియలను పరిశీలించారు. చేనేత టైఅండ్‌డై ఇక్కత్ పట్టుచీరల డిజైన్లను పరిశీలించి, చేనేత కళాకారుల కళాత్మక ప్రతిభను వారు ప్రశంసించారు. చేనేత సహకార సం ఘం విక్రయశాలలోని చేనేత వస్త్రాలను వారు పరిశీలించారు. చేనేత సహకార సంఘం పనితీరులను మేనేజర్ రుద్ర ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విదేశీ పర్యాటక బృందానికి గైడ్ మధు మార్గదర్శనం చేశారు. భూదానోద్యమ చారిత్ర నేపథ్యాన్ని తెలుసుకున్నారు. భూదాన్ గంగోత్రి ప్రాంగణాన్ని సందర్శించి భూదానోద్యమ చారిత్రక ఘట్టాలను మ్యూజియంలోని ఫొటో గ్యాలరీని వీక్షించి తెలుసుకున్నారు.