Share News

మూసీకి పుష్కల జలం.. కన్నీటి సాగరం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:58 PM

హైదరాబాద్‌ జంట నగరాల నుంచి వచ్చే వృథా నీటికి, మూసీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరు తోడవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో పెద్ద నీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది.

మూసీకి పుష్కల జలం.. కన్నీటి సాగరం

పూర్తిస్థాయి నీటిమట్టానికి 10 అడుగుల దూరంలో మూసీ

కనిష్ఠ నీటిమట్టానికి దిగువకు నాగార్జునసాగర్‌

కేతేపల్లి, నాగార్జునసాగర్‌: హైదరాబాద్‌ జంట నగరాల నుంచి వచ్చే వృథా నీటికి, మూసీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరు తోడవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో పెద్ద నీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. 623 అడుగుల కనిష్ఠ స్థాయి నుంచి మండు వేసవిలో సైతం ప్రాజెక్టు నీటిమట్టం 636.20 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 40 రోజుల్లో మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 13 అడుగుల మేర పెరిగి వరద నీటితో ప్రాజెక్టు కళకళలాడుతోంది. నాగార్జునసాగర్‌లో దీనికి భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్టు కనిష్ఠ నీటిమట్టం 510 అడుగులు కాగా, దీనికి దిగువకు 504.70 అడుగుల వద్ద ప్రాజెక్టు నీటిమట్టం ఉంది.

వేసవిలో మండే ఎండలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఎండి బీటలు వారుతుంటే మూసీ ప్రాజెక్టు నీటిమట్టం మా త్రం ఒక్కో అడుగు పెరుగుతూ గరిష్ఠస్థాయికి 10 అడుగుల దూరం లో ఉంది. వానాకాలం నాటికే ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరువలోకి వస్తుండటం, ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నీటిమట్టం గత నెల (ఏప్రిల్‌) 27వ తేదీ నాటికి 623.10 అడుగుల (0.67టీఎంసీలు) కనిష్ఠ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో ఎగువ మూసీ నదికి ఇరువైపులా పరివాహక ప్రాంతాల్లోని ధర్మారెడ్డి కాల్వ, పిల్లాయిపల్లి, ఆసి్‌ఫనహర్‌ కత్వలు, ఇతర ఫీడర్‌ ఛానళ్లకు మ ళ్లించిన హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే డ్రైనేజీ, వృథా నీటితో చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి ప్రస్తుతం అలుగు పోస్తున్నాయి. ఆయా చెరువులు, కుంటల అలుగుల నుంచి వచ్చే నీరంతా ప్రస్తుతం దిగువ న ఉన్న మూసీ ప్రాజెక్టుకు చేరుతోంది. మరోవైపు హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న అకా ల వర్షాలకు వరద మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో గత 40 రోజులుగా ప్రాజెక్టుకు 600 నుంచి 1,000 క్యూసెక్కుల మేర ఇన్‌ ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 636.20 అడుగులుగా(2.41 టీఎంసీలు) నమోదైంది. ఎగువ నుంచి 750.57 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 64.35 క్యూసెక్కుల మేర నీరు లీకేజీలు, ఆవిరి రూపంలో వెళ్తోంది. కాగా, గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 641.80 అడుగులు (3.47టీఎంసీలు)గా, ఇన్‌ఫ్లో 625 క్యూసెక్కులుగా ఉంది.

504అడుగుల వద్ద సాగర్‌

నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం గత ఆరేళ్లతో పోలి స్తే ఈ ఏడాది ఆందోళనకరంగా మారింది. ఆరేళ్ల క్రితం సాగర్‌ ప్రాజె క్టు నీటి మట్టం కనిష్ఠ స్థాయి 510 అడుగుల దిగువకు చేరుకుంది. తిరిగి ఈ ఏడాది కనిష్ఠ స్థాయి దిగువకు నీటిమట్టం చేరుకుంది. గత ఏడాది కృష్ణానది బేసిన్‌లో సరిపడా వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టు ల్లో కేవలం తాగు నీటి అవసరాలకు మాత్రమే నీరుంది. దీంతో సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టులో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఈ ఏడాదైన వరుణుడు కరుణించి ఆయకట్టుకు సాగు నీటి విడుదల ఉంటుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మ ట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 504.70 అడుగులుగా (122.8483టీఎంసీలు)ఉంది. సాగర్‌ నుంచి జంట నగరాలకు తాగునీటి అవసరాలకోసం పుట్టగండి వద్ద ఎమర్జెన్సీ వద్ద మోటా ర్లద్వారా 800 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 800క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.

ముందస్తు వర్షాలు

ముమ్మరంగా వ్యవసాయ పనులు

నల్లగొండ: ఎన్నడూలేని విధంగా ఈఏడాది మే నెలలో అకాల వర్షాలు కురవడం, ఆతరువాత అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి జిల్లా అంతటా రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. మే నెలాఖరులో రోహిణి కార్తెలో వేసవిదుక్కుల్లో పత్తి విత్తనాలు కూడా విత్తారు.దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ఏడాది ముందుగానే రావడంతో వేసవిలో పత్తివిత్తనాల వేసిన రైతులు గట్టెక్కారు. నల్లగొండ జిల్లాలో ఈనెల ఈనెల 8వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 20.9మి.మీకు 109 మి.మీ వర్షం కురిసింది. ఈనెల 8వతేదీవరకు మొత్తం429.5 మి.మీ వర్షం కురిసింది. నల్లగొండ డివిజన్‌లో 387.3మి.మీ, మిర్యాలగూడ డివిజన్‌లో 523.6, దేవరకొండ డివిజన్‌లో 492.3, చండూరు డివిజన్‌లో 232.9మి.మీ వర్షం కురిసింది. చాలాచోట్ల రైతులు వరి నార్లుపోయగా, ఇప్పటికే 60శాతానికి పైగా పత్తి విత్తనాలు విత్తారు.

Updated Date - Jun 08 , 2024 | 11:58 PM