Share News

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:13 AM

:ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిడీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో ఎక్కువ మంది తీవ్రజ్వరం,ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడం తో వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

డీఎంహెచ్‌వో కొండల్‌రావు

మాడ్గులపల్లి,మార్చి 21: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిడీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో ఎక్కువ మంది తీవ్రజ్వరం,ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడం తో వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారికి మందులను అందుబాటులో ఉంచి మెరుగైన సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. గ్రామంలో తాగునీటి పరీక్షల కోసం శాంపిళ్లు సేకరించారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, డీఎంవో దుర్గయ్య, డాక్టర్లు రాజేష్‌, ఇక్తియార్‌ పాల్గొన్నారు.

వైద్య శిబిరాలు నిర్వహించాలి

తిప్పర్తి: గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎర్రగడ్డలగూడెం గ్రామాన్ని వైద్య బృందంతో కలిసి ఆయన సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని, వీటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించి వైద్య శిబిరాలకు సిబ్బంది సర్దుబాటు, విధుల కేటాయింపుపై సమీక్షించారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఎర్రగడ్డలగూడెంలో 10 డెంగీ కేసులు నమోదైనందున శిబిరాలు నిర్వహించి వైద్యం అందించాలన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:13 AM