Share News

కుక్కల దాడిలో నెమలి మృతి

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:22 AM

యాదగిరిగుట్ట కొండకింద స్థానిక బస్టాండ్‌లో బుధవారం కుక్కల దాడిలో నెమలి మృత్యువాత పడింది.

కుక్కల దాడిలో నెమలి మృతి

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 17: యాదగిరిగుట్ట కొండకింద స్థానిక బస్టాండ్‌లో బుధవారం కుక్కల దాడిలో నెమలి మృత్యువాత పడింది. స్థానిక గుజ్జ భాస్కర్‌ అనే వెంటనే నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పారెస్టు అధికారులు నెమలి కళేబరానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖననం చేస్తామని తెలిపారు. కొండకింద పరిసరాల్లో ఆహారం కోసం నెమలి కిందకి వచ్చినట్లు తెలుస్తోంది. నెమలిని గుర్తించేలోగా అప్పటికే మృత్యువాత పడిందని స్థానికులు పేర్కొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 07:52 AM