Share News

27న ఆలేరు మునిసిపల్‌ చైర్మనపై అవిశ్వాస బల నిరూపణ

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:42 AM

ఆలేరు మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై బల నిరూపణ చేసుకోవాలని కలెక్టర్‌ హనుమంత కె.జెండగే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

 27న ఆలేరు మునిసిపల్‌ చైర్మనపై అవిశ్వాస బల నిరూపణ

ఆలేరు రూరల్‌, జనవరి 11: ఆలేరు మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై బల నిరూపణ చేసుకోవాలని కలెక్టర్‌ హనుమంత కె.జెండగే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపల్‌ చైర్మన శంకరయ్య తీరును నిరసిస్తూ ఆలేరుకు చెందిన 8మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇటీవల అవిశ్వాసం తీర్మానం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయమై స్పందించిన కలెక్టర్‌ అవిశ్వాస తీర్మానం కోరుతున్న కౌన్సిలర్లకు బలనిరూపణ చేసుకోవాలని ఉత్తర్వులను జారీ చేశారు. ఆలేరు మునిసిపల్‌ చైర్మన శంకరయ్యను బలపరుస్తూ గతంలో 8 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మద్దతు పలుకగా కాంగ్రెస్‌ నుంచి ఒకరు బీజేపీ నుంచి ఒకరు స్వతంత్య్ర అభ్యర్థి నుంచి మరొక కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది కౌన్సిలర్లకు గాను 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతున్న వారిలో ఉన్నారు. ఈ నెల 27న జరుగుతున్న అవిశ్వాస తీర్మాణంపై బలనిరూపణ చేసి చైర్మనను గద్దె దించాలన్న యోచనలో 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 07:10 AM