Share News

నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:47 AM

నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వా సం నెగ్గింది. దీంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అ నుచరుడు సైదిరెడ్డి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

అవిశ్వాసానికి 41మంది కౌన్సిలర్ల మద్దతు

బీఆర్‌ఎ్‌సకు ఐదుగురు, ఒకరు తటస్థం

గైర్హాజరైన ఎక్స్‌ అఫీషియో సభ్యులు

రామగిరి: నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వా సం నెగ్గింది. దీంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అ నుచరుడు సైదిరెడ్డి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తరువాత మా రిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కలెక్టర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో సోమవారం అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. మునిసిపాలిటీలో 48 మంది కౌన్సిలర్‌తో పాటు ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 50 మంది ఓటింగ్‌ కు పాల్గొనాల్సి ఉంది. అందులో ముగ్గురు గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ఇన్‌చార్జి కలెక్టర్‌ అవిశ్వాస తీర్మాన చట్టాన్ని కౌన్సిల్‌ సభ్యుల కు వివరించారు. అనంతరం అవిశ్వాస తీర్మానికి మద్దతు తెలిపేవారు చేతులెత్తాలని కోరగా, 34 మం ది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు, ఇద్దరు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మొత్తం 41 మంది చేతులెత్తి మద్దతు తెలిపారు. బీఆర్‌ఎ్‌సకు మద్దతు గా చైర్మన్‌ మందడి సైదిరెడ్డితోపాటు మరో నలుగు కౌన్సిలర్లు మొత్తం ఐదుగురు మాత్రమే మద్దతు తెలిపారు. కౌన్సిలర్‌ పిల్లి రామరాజు తటస్థంగా ఉం డగా, బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బండారు ప్రసా ద్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గైర్హాజరయ్యారు. అవిశ్వాసం నెగ్గేందుకు 34 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం కాగా, 41 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రకటించారు. నిబంధనల ప్రకారం నూతన చైర్మన్‌ను ఎన్నుకునేందుకు అవిశ్వాసం ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరో మారు కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. 2020 జనవరి 25న మునిసిపల్‌ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మందడి సైదిరెడ్డి అవిశాస్వం కారణంగా పదవీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కాగా, నూతన చైర్మన్‌ ఎన్నికయ్యేంత వరకు ప్రస్తుత వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

గత పాలకుల పనితీరుకు వ్యతిరేకంగానే ఓటింగ్‌ :శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

గత పాలకులకు వ్యతిరేకంగానే అవిశ్వాస సమావేశం జరిగింది. నాలుగేళ్ల కాలం లో ఒక్క రోడ్డు తప్ప ఏ వార్డులో కూడా అభివృద్ధి పనులు జరగలేదు. అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఆయా వార్డు ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడే పరిస్థితి వచ్చింది. చై ర్మన్‌ను దింపితే తప్ప అభివృద్ధి సాధ్యం కాదనే అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.

డబ్బుకు అమ్ముడుపోయారు : మందడి సైదిరెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో నాలుగేళ్ల లో వందల కోట్ల రూపాయలతో పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. అభివృద్ధి పనుల్లో ఏదైనా అవినీతి, అక్రమాలు జరిగితే ప్రజాప్రయోజనాల కోసం అవిశ్వాసం పెట్టా లి. కానీ, బీఆర్‌ఎస్‌ బీ-ఫాం మీద గెలిచిన కొందరు కౌన్సిలర్లు డబ్బుకు అమ్ముడుపోయి కాంగ్రె్‌సలో చేరి అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇది పూర్తిగా స్వార్థ రాజకీయమే. ఇప్పటికే 21 మంది కౌన్సిలర్లకు విప్‌ కూడా జారీ చేశాం. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం. విప్‌కు వ్యతిరేకంగా ఓటు వే సిన కౌన్సిలర్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలని రేపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. వారి సభ్యత్వాన్ని కలెక్టర్‌ రద్దు చేస్తారనే నమ్మకం ఉంది.

Updated Date - Jan 09 , 2024 | 12:47 AM