Share News

రెండో రోజు తొమ్మిది నామినేషన్లు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:00 AM

లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు తొమ్మిది నా మినేషన్లు దాఖలయ్యాయి.

రెండో రోజు తొమ్మిది నామినేషన్లు

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

యాదాద్రి/నల్లగొండటౌన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు తొమ్మిది నా మినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ స్వ తంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ధర్మ సమాజ్‌ పార్టీ తరఫున తలారి రాంబాబు, మార్క్సిస్ట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యు నైటెడ్‌) పార్టీ తరఫున వసుకుల మట్టయ్య, కిన్నెర యాదయ్య స్వతం త్ర అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందనకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. భువనగిరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌, సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌, సోషలిస్టు పార్టీ(ఇండియా) అభ్యర్థి రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్‌ చందునాయక్‌, రేకల సైదులు ఒక్కో సెట్‌ నామినేషను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ నామినేషన్‌ పత్రాల దాఖలుకు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. మొదటిరోజు ఏడు నామినేషన్లు దాఖలు చేయగా, రెండో రోజు తొమ్మిదితో మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

భువనగిరి అర్బన్‌: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తుండడంతో ప్రధానగేట్‌ వద్ద పోలీసులు గుర్తింపు కార్డు లు, ఇతర వాహనాలను తనిఖీచేసి లోపలికి అనుమతించారు. కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ ఎదురుగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగి 100 మీటర్ల నిబంధన అమలు కావడం లేదు. సీపీఎం అభ్య ర్థి వెంట వచ్చిన కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే పులిహోర తెచ్చుకొని తిన్నారు.

నామినేషన్‌ కౌంటర్‌

నియోజకవర్గం 19న గతంలో మొత్తం

దాఖలు దాఖలు

నల్లగొండ 4 4 8

భువనగిరి 5 3 8

మొత్తం 9 7 16

Updated Date - Apr 20 , 2024 | 12:00 AM