చెరువులపై నజర్
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:18 AM
రియల్టర్ల భూదాహం, అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా పట్టణాలో ్లని చెరువులు, కుంటలు క్రమేపీ రూపు కోల్పోతున్నా యి.
పట్టణాల్లో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలు
వాటిని రక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కార్యాచరణ
48 అంశాలు, అభివృద్ధిపై సూక్ష్మ ప్రణాళికలు 5వ తేదీ లోగా అందజేయాలని కమిషనర్లకు ఆదేశాలు
ఉమ్మడి జిల్లాలోని 19మునిసిపాలిటీల్లో 100చెరువులు, కుంటలు
భువనగిరి టౌన్: రియల్టర్ల భూదాహం, అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా పట్టణాలో ్లని చెరువులు, కుంటలు క్రమేపీ రూపు కోల్పోతున్నా యి. వర్షాకాలంలో వాటికి వచ్చే వరదను పైభాగంలో ఉన్న చెరువులు, నదులకు చేర్చే కాల్వల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని కబ్జాలకు గురవుతుండ గా, మరికొన్ని శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు.
ఒకప్పుడు నిండుకుండలా ఉంటూ పట్టణాల్లో భూగర్భజలాల నీటి మట్టం భద్రతకు దోహదపడిన చెరువులు, కుంటలు నేడు కనీస నీటి మట్టానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోని చెరువుల సం రక్షణకు మునిసిపల్‌శాఖ చర్యలు చేపట్టింది. పట్టణాల్లోని చెరువులు, కుంటలను గుర్తించి వాటి పూర్వపరాలు, నేటి స్థితిగతులపై ఈ నెల 5 తేదీలోగా 48 అంశాలతో సమగ్ర నివేదిక, అభివృద్దికి సూక్ష్మ ప్రణాళికలు ఇవ్వాలని మునిసిపల్ పరిపాలనా విభాగం సంచాలకుడు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ని 19 మునిసిపాలిటీల పరిధిలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి చెరువుల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మునిసిపల్ యంత్రాంగం కుస్తీ పడుతోంది.
చెరువుల పునరుజ్జీవమే లక్ష్యం
పట్టణాల ప్రగతిలో కీలకంగా ఉండి, నేడు భద్రత కరువైన చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా మునిసిపల్ శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చెరువులు, కుంటల ఆక్రమణల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రతీ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) హద్దుల ఏర్పాటుకు సంకల్పించింది. అయితే ఇప్పటికే సుమారు అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్ హద్దులు ఉన్నా, రియల్టర్ల కారణం గా అవి కనుమరుగవుతున్నాయి. చెరువు శిఖంతో పాటు ఏకంగా చెరువులు, కుంటల్లో వెంచర్లు చేస్తుండడంతో వాస్తవాలు తెలియని పలువురు ప్లాట్లను కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అలాగే పట్టణాల్లో మురుగు నీరు, చెత్త తదితర వ్యర్థాలను కొన్ని మునిసిపాలిటీలు చెరువుల్లో క లుపుతుండగా,మరికొన్ని ప్రాంతాల్లో స్ర్కాప్, మాంస విక్ర య తదితర వ్యాపారులు, పలువురు చిరువ్యాపారులు వ్యర్థాలను చెరువుల్లో పడవేస్తున్నారు. దీంతో చెరువు నీరు కలుషితమవుతుండడంతో పాటు పరిసరాల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. అయితే ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు ఎంపిక చేసిన పలు చెరువులను ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. భువనగిరి పెద్ద చెరువు కట్టను సుమారు రూ.10కోట్ల వ్య యంతో చేస్తున్న అభివృద్ధి చేస్తుండగా, త్వరలో ఇది పర్యాటక కేంద్రంగా మారనుంది. అలాగే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రాయిగిరి, గండి చెరువును కూడా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇదే తరహా చెరువుల అభివృద్ధి ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో సాగుతోంది. కానీ మెజార్టీ చెరువులు మాత్రం అభివృద్ధికి దూరంగా, కబ్జాలకు దగ్గరగా ఉన్నాయి.
48 అంశాలతో నివేదిక
పట్టణాల్లోని చెరువులను కాపాడే లక్ష్యంతో చేపట్టిన చర్యల్లో భాగంగా 48 అంశాలతో కూడిన సమగ్ర నివేదిక ను, చెరువుల అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు ఈ నెల 5వ తేదీలోగా ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. చెరువుల విస్తీర్ణం, నీటి నిల్వ సామర్ధ్యం, రికార్డులు, ఆక్రమణలు, కబ్జా స్థలా ల్లో నిర్మాణాలు, ఎఫ్‌టీఎల్ హద్దులు, వాటి నిర్వహణ తదితర అం శాలపై కమిషన ర్లు నివేదిక అందజేయాల్సి ఉంది. అం దుకోసం పలువురు కమిషనర్లు చెరువుల వివరాలు,సర్వే కోసం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు లేఖలు రాశారు.
చెరువుల అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు
చెరువుల వివరాలతో పాటు వాటి అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి గడువులోగా కమిషనర్లు నివేదించా ల్సి ఉంది. అయితే చెరువుల పునరుజ్జీవం లో భాగంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని మునిసిపల్‌శాఖ సంచాలకుడు ఆదేశించా రు. చెరువుల్లో వ్యర్థాలను కలపకుండా నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని, గ్రీన్ ఫినిషింగ్ కోసం వెదురు మొక్కలు పెంచాలని, కమ్యూనిటీ పోలీసింగ్, నర్సరీల అభివృద్ధితో కూడిన సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. అయితే భువనగిరిలో మురుగు నీరం తా పట్టణ శివారులోని తీనం చెరువులోకి చేరుతోంది. ఈ చెరువు అలుగు పోసినప్పుడు దిగువభాగంలోని గొలుసుకట్టు చెరువుల్లోకి కూడా మురుగు నీరు ప్రవహిస్తోంది. ఇదే తరహా పరిస్థితి మరికొన్ని పట్టణాల్లో ఉంది. మునిసిపల్‌శాఖ చేపట్టిన చెరువుల పరిరక్షణ, సూక్ష్మ ప్రణాళికలు అమలులోకి వస్తే చెరువుల సంరక్షణతో పాటు చెరువుల్లోకి మురుగు నీటి ప్రవాహం తప్పనుంది.
సర్వే కోసం ఇరిగేషన్ శాఖకు లేఖ రాశాం : పి.రామాంజల్‌రెడ్డి, భువనగిరి మునిసిపల్ కమిషనర్
భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని మూడు చెరువులు, మూడు కుంటల సర్వే కోసం ఇరిగేషన్‌శాఖకు ఇటీవల లేఖ రాశాం. సర్వేతో పాటు మరోసారి ఎఫ్‌టీఎల్ హద్దులను గుర్తించాలని కోరాం. చెరువుల విస్తీర్ణంపై రెవెన్యూశాఖ నుంచి వివరాలను సేకరిస్తున్నాం. చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. ఇప్పటికే భువనగిరి పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. పట్టణంలోని చెరువులను, కుంటలను కాపాడేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటాం.