Share News

గులాబీ దళం పటిష్ఠతపై నజర్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:12 AM

లోక్‌సభ ఎన్నికల్లోపు గులాబీదళాన్ని పటిష్ఠం చేసేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా స్థానిక నేతలతో సమీక్ష సమావేశాలు పూర్తి చేసింది.

గులాబీ దళం పటిష్ఠతపై నజర్‌

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం

అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు

అన్ని పార్టీలు సమీక్షల్లో బిజీబిజీ

రంగంలోకి సీపీఎం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): లోక్‌సభ ఎన్నికల్లోపు గులాబీదళాన్ని పటిష్ఠం చేసేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా స్థానిక నేతలతో సమీక్ష సమావేశాలు పూర్తి చేసింది. తాజాగా భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నదే ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. అయితే తెలంగాణలో ఉద్యమ పార్టీగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీఆర్‌ఎస్‌ అనూహ్యంగా గద్దె దిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై చర్చించనున్నా రు. క్షేత్రస్థాయిలోని నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ అఽధిష్ఠానం నిమగ్నమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ, భూ మి ఉన్నంత వరకూ ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఇటీవ ల భువనగిరిలో నిర్వహించిన సభలో ఆ పార్టీ సీనియర్‌ నేత టి.హరీ్‌షరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని సభలు నిర్వహించి, పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సన్నాహాలు చేస్తోంది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని తుంగుతుర్తి, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం, నకిరేక ల్‌, ఆలేరు, భువనగిరిలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలన్నీ మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చురుకైన పాత్ర పోషించాలి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చురుకైన పాత్ర పోషించాల ని అధిష్ఠానం సూచించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించింది. అయితే బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఇటీవ ల జరిగిన ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌ స్థానాల్లో క్లీన్‌స్వీ్‌పగా ఓడిపోయింది. జనగామ, సూర్యాపేట మినహా అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకుల బాగోగులు ఇన్నాళ్లుగా చూసుకున్న మాజీ ఎమ్మెల్యేలు ఓట మి నైరాశ్యంతో నియోజకవర్గాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేంతా కూడా నియోజకవర్గాలను చుట్టేస్తూ... లోక్‌సభ ఎన్నికల్లో చురుకైన పాత్ర పో షించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. పార్టీలోని సీనియర్‌ నేతలతో సమన్వ యం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం సూచించింది.

రంగంలోకి సీపీఎం

లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ను అభ్యర్థిగా బరిలో దింపింది. రాష్ట్రంలో సీపీఎం భువనగిరి స్థానం నుంచి పోటీలో ఉంటుందని అధిష్ఠానం ప్రకటించింది. ఉద్యమ నేపథ్యంలో ఉన్న నియోజకవర్గాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వామపక్షాల నుంచి సీపీఎం రంగంలో ఉండగా... సీపీఐ సైతం తమకు రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరింది. అయితే నల్లగొండ, భువనగిరి స్థానాలను అభ్యర్థులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయంపై సీపీఐ భవిష్యత్‌ ఆధారపడి ఉండగా... సీపీఎం మాత్రం ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది.

స్థానిక నేతలను కాపాడుకునే పనిలో బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు మునిసిపాలిటీల్లో పార్టీలకతీతంగా చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా పటిష్ఠంగా ఉంటేనే లోక్‌సభతోపాటు రానున్న ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీంతో పార్టీలోని సీనియర్‌ నేతలతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలతో అధిష్ఠానం పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీపరంగా అన్ని విధాలా భవిష్యత్‌ ఉంటుందని, పార్టీ మారొద్దని సూచిస్తున్నారు. ఇటీవల భువనగిరితోపాటు పలు మునిసిపాలిటీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పార్టీ కొంత బలహీనపడింది. దీంతో వెంటనే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మేల్కొని ఆలేరు, సూర్యాపేట మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు వీగిపోయేలా ప్రయత్నాలు చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ మరింత బలపడుతుందని, తెలంగాణలో సమస్యలపై పోరాడేది తమ పార్టీ అనే భావనను నేతలు, కార్యకర్తల్లో నింపేందుకు అధిష్ఠానం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

అన్ని పార్టీలు సమీక్షల్లో బిజీబిజీ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమీక్షల్లో బిజీబిజీగా ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు ఆయా పార్టీల సీనియర్‌ నేతలతో పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గాలవారీగా పార్టీలోని సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలగా నియామకాలు చేపట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్‌ స్థానాలున్నాయి. భువనగిరి పార్లమెంట్‌ స్థానం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గం యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, జనగాం జిల్లాల పరిధిలో ఉంటుంది. భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, సూర్యాపేట, కోదాడ, హుజుర్‌నగర్‌, దేవరకొండ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆయా పార్టీలను బలోపేతం చేయడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ముందస్తుగానే భువనగిరి అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, నల్లగొండ అభ్యర్థి సైదిరెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్‌ బరిలోకి దింపింది. ఈమేరకు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టేందుకు స్వయంగా రాష్ట్ర నాయకత్వాలు షెడ్యూల్‌ను రూపొందించాయి. తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు అగ్రనేతల్లో ప్రచారానికి తెరలేపుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఏఏ నియోజకవర్గాలో అగ్రనేతలతో ప్రచారాన్ని చేపట్టాలన్న అంశంపై సీరియ్‌సగా చర్చిస్తోంది. తెలంగాణలో బీజేపీ కనీసం 10 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం పార్టీ పెద్దలతో సమాలోచనలు చేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:15 AM