Share News

ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:45 AM

ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్‌ హనుమంతు కె.జెండగె అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన ఉండాలి
ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హనుమంతు కె.జెండగె

కలెక్టర్‌ హనుమంతు కె జెండగె

భువనగిరి అర్బన్‌, జనవరి 29: ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్‌ హనుమంతు కె.జెండగె అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికల సమయానికి ప్రతీ ఒక్కరికి ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన ఉండాలన్నారు. వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఓటింగ్‌ యంత్రాల పనితీరును వివరించాలని సూచించారు. అనంతరం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, పలు పార్టీల నాయకులు సయ్యద్‌ ముల్తాన, సోమ రవీందర్‌రెడ్డి, కె.నాగరాజు, బట్టు రామచంద్రయ్య, కలెక్టరేట్‌ ఏవో జగన్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఎం.నాగేశ్వరచారి, డీటీ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:45 AM