పట్టభద్ర ఓటరుగా నమోదు చేసుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:41 PM
వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్ర నియోజకవర్గంలో అర్హులైన వారు ఓటరుగా న మోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన కోరారు. శుక్రవా రం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

కలెక్టర్ హరిచందన
నల్లగొండ టౌన్, జనవరి 12: వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్ర నియోజకవర్గంలో అర్హులైన వారు ఓటరుగా న మోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన కోరారు. శుక్రవా రం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2023 నవంబరు 1 కంటే ముందు డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, స్థానికులు ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతీఎన్నికకు నూతన ఓటర్ జాబితా తయారు చేస్తున్నందు న ఇంతకు ముందు కూడా ఓటరుగా ఉన్నవారు సైతం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ను తహసీల్దార్ కార్యాలయంలోగానీ ఆన్‌లైన్‌లోగానీ సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6వ తేదీ అని, ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామన్నారు. ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చి14వ తేదీ వరకు తీసుకుంటామన్నారు. మార్చి 29వరకు వాటిని పరిశీలించి ఏప్రిల్ 4న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2024లో భాగంగా ఓటరుగా నమోదు చేసుకునేవారు 2023 నవంబరు 1నాటికి 18ఏళ్లునిండిన వారు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని పొలింగ్ బూత్‌లలో ఓటర్ నమోదు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపా రు. ఫిబ్రవరి 8నతుది జాబితా విడుదల చేస్తామన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను కలెక్టర్ హరిచందన పరిశీలించారు. ఐటీ టవర్‌తోపాటు పలు జంక్షన్లు, ఫుడ్ బజార్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, రైతు బజార్‌ను ఆమె పరిశీలించారు. మేకల అభినవ్ ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాన్ని పరిశీలించి స్విమ్మింగ్ పూల్ మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న తైక్వాండో, బ్యాడ్మింటన్, అవుట్ డోర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను తిలకించారు. అదేవిధంగా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, ఉన్నారు.