Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ముదిమాణిక్యం చారిత్రక వైభవం

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:11 AM

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని ముదిమాణి క్యం గ్రామం చారిత్రక సంపదకు నెలవుగా మారింది. క్రీస్తుశకం 1635వ కాలంలోనే కృష్ణానదీ తీరంలో ఉన్న ముదిమాణిక్యం గ్రామం పట్టణంగా విలసిల్లింది.

ముదిమాణిక్యం చారిత్రక వైభవం

కృష్ణానదీ తీరంలో బాదామి చాళుక్యుల నాటి ఆలయాలు

ఓడరేవుతో వర్తక, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి

పర్యవేక్షణలేక కనుమరుగువుతున్న చారిత్రక గుర్తులు

కట్టడాలను పరిరక్షించాలని కోరుతున్న గ్రామస్థులు

అడవిదేవులపల్లి: నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని ముదిమాణి క్యం గ్రామం చారిత్రక సంపదకు నెలవుగా మారింది. క్రీస్తుశకం 1635వ కాలంలోనే కృష్ణానదీ తీరంలో ఉన్న ముదిమాణిక్యం గ్రామం పట్టణంగా విలసిల్లింది. శతాబ్ధాల క్రితమే వర్తక, వాణిజ్యాలకు కేంద్రంగా ముదిమాణిక్యం విరాజిల్లిందని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.

గ్రామంలో సుమారు 1,300 ఏళ్ల నాటి పురాతన ఆలయాలను చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఆలయాలు బాదామి చాళుక్యుల కాలానికి చెందినవని పబ్లిక్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజి, హెరిటేజ్‌(ప్రిహా), తెలుగు వర్సిటీకి చెందిన డాక్టర్‌ ఎంఏ. శ్రీనివాసన్‌, ఎన్‌. అశోక్‌కుమార్‌ల బృందం పేర్కొంది. ఆలయాల్లో శివలింగం, విష్ణు విగ్రహ శిథిలాలతోపాటు ఒక శాసనాన్ని గుర్తించారు. శాసనంలో ‘గండలోణర్రు‘ అనే పదం ఉందని బహుశా అది 8వ శతాబ్ధానికి చెందినది కావొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కృష్ణాన ది ఒడ్డున ఉన్న రెండు ఆలయాలను క్రీస్తుశకం 543 నుంచి 750 మధ్య కాలంలో నిర్మించి ఉంటారని తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎంఏ. శ్రీనివాసన్‌ తెలిపారు. ఆలయాలు కాదంబనగార శైలిని, రేఖాన గార శైలి పద్ధతిలో నిర్మించినట్లు గుర్తించారు. ఇదే గ్రామం లో ఉన్న ఐదు దేవాలయాల్లో (పంచకూట) ఒక ఆలయంలోని స్తంభంపై ‘గండలోణర్రు‘ అని లఘు శాసనంపై రాసిఉంది. ఈ స్తంభాన్ని 8 లేదా 9వ శతాబ్ధంలో నిర్మించారు. ఈ లఘు శాసనాన్ని ఒక వీరుడి బిరుదుగా భావిస్తున్నట్లు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మునిరత్నం వివరించారని స్థానికులు తెలిపారు. అదేవిధంగా ముదిమాణిక్యం గ్రామం నడిబొడ్డున ఉన్న రామాల యం వద్ద 350ఏళ్ల నాటి ఒక స్తంభాన్ని కనుగొన్నట్లు చరిత్రకారులు ప్రిహా తెలిపారు. కృష్ణానదితీరంలో పురాతన సోమేశ్వరాలయం వద్ద 20 అడుగుల మేర ఉన్న ధ్వజ స్తంభమే అలనాటి దీప స్తంభంగా గుర్తించారు. దీప స్తంభం శకనామ సంవత్సరం ప్రకారం 1,557 సంవత్సరంలో నిర్మించినట్లు దానిపై రాసి ఉండగా క్రీ.శ ప్రకారం 1635 జూన్‌ 1న సోమవారం అని ఆ స్తంభంపై మాదిరాజు నర్సయ్య శాసనాన్ని లిఖించిన ట్లు పబ్లిక్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాల జి, హెరిటేజ్‌(ప్రిహా) నిర్థారించారు. శాసనంపై తెలుగు తమిళ పదాలు ఉన్నట్లు కాశీవిశ్వనాథుని ప్రార్థిస్తున్నట్లు పద్యం కూడా రాసినట్లు తెలిపారు. ఈ శాసనాన్ని ఆనాడు ముదిమాణిక్యాన్ని పాలించిన వాలి మునులయ్య కుమారు డు పొలినేడు వేయించినట్లుగా గుర్తించారు. దీప స్తంభమే నాటి ప్రజలకు దిక్సూచిగా ఉండేదని భావిస్తున్నారు.

మునిమాణిక్యమే... నేటి ముదిమాణిక్యం

క్రీ.శ సుమారు 1,213 సంవత్సరంలో కల్యాణ చాణక్య వం శానికి చెందిన త్రిభునమల్లదేవుడు, అతని సామంతరాజైన తొండేశ్వరుడు 50 స్తంభాలతో కూడిన సత్రశా ల బౌద్ధమ దేవాలయాలు నిర్మించారు. అయితే అక్కడ కొన్నాళ్లకు ఆ దేవాలయాల వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతంలో ‘బౌద్ధంపాడు’ అనే గ్రామం వెలిసింది. గ్రా మస్థులు నిత్యం ఆ దేవాలయంలో పూజలు, పండుగ లు చేసేవారు. అప్పట్లో ఆ గ్రామానికి గత్తర వచ్చి గ్రామం కనుమరుగై పోయింది. ఆగ్రామానికి నాలు గు కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది. ఆ అడవి సమస్త దేవుళ్ల నిలయంగా ఉండేది. అక్కడికి దేవు ళ్లు వచ్చి వెళ్తుంటారని భక్తుల నమ్మకం. ఆ అడవి లో బౌద్ధంపాడు ప్రజలు కొందరు నివాసం ఏర్పా టు చేసుకొని జీవిస్తున్నారు. ఆ అడవిలోనే కొందరు మునులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మునులు, ప్రజలు నివాసముంటు న్న ప్రాంతాన్ని మునిమాణిక్యంగా పిలిచేవారు కాలక్రమేణా మునిమాణిక్యం అనే పేరు ముదిమాణిక్యంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు.

కనుమరుగవుతున్న చారిత్రక సంపద

క్రీస్తుశకం 13వ శతాబ్ధం నుంచి 17వ శతాబ్ధం వర కు కల్యాణ చాళుక్యులు, బాదామి చాళుక్యులు ముదిమాణిక్యం గ్రామాన్ని పాలించారు. ఆ కాలంలోనే పట్టణంగా విరాజిల్లింది. కృష్ణానది తీరంతోపాటు గ్రామ నడిబొడ్డున ఎన్నో పురాతన ఆలయా లు, కోటలు, దీపపు స్తంభాలు, పురాతన ఓడరేవు, శాసనాలు నెలవుగా మారింది. కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ఆలయాలను, ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్నారు.

పడవలు, ఓడలకు దిక్సూచిలా దీపస్తంభం : చల్లా శివారెడ్డి ముదిమాణిక్యం

500 ఏళ్ల క్రితం కృష్ణానది తీరంలో ఉన్న దీప స్తంభంపై దీపాలు వెలిగించేవారు. ఆ దీపం దిక్సూచిగా ఉపయోగపడి గ్రామానికి పడవలు, ఓడ లు రాకపోకలు సాగించేవి. గ్రామానికి నాలుగు దిక్కుల్లో స్తంభాలపై నాలుగు శాసనాలు అప్పట్లో వేయించారు. ముదిమాణిక్యం గ్రామం ఎంతో ప్రసిద్ధి చెం దగా ఇప్పుడు నాటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇ ప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని ముదిమాణిక్యం గ్రా మంలోని గుడి, కోటలను, దీప స్తంభాలను పరిరక్షించాలి.

Updated Date - Mar 03 , 2024 | 12:11 AM