Share News

స్వేచ్ఛ, సమానత్వం కోసం ఉద్యమించాలి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:34 AM

స్వేచ్ఛ, సమానత్వం కోసం మహిళలు ఉద్యమించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు.

స్వేచ్ఛ, సమానత్వం కోసం ఉద్యమించాలి
చౌటుప్పల్‌టౌన: సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి అనురాధ

చౌటుప్పల్‌ టౌన, మార్చి 7: స్వేచ్ఛ, సమానత్వం కోసం మహిళలు ఉద్యమించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చౌటుప్పల్‌ పట్టణంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళల హక్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. సదస్సులో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ దండ హిమబిందు, ఐద్వా ప్రతినిదులు దొడ్ల అండాలు, బత్తుల వరలక్ష్మి, రాణి, లలిత, భాగ్యమ్మ, గీత , రూప, రమాదేవి, భారతమ్మ, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:34 AM