డీసీసీబీకి అధిక నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:26 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి ప్రభుత్వం నుంచి అధిక నిధులు కేటాయించాలని వ్యవసాయ, కోఆపరేటివ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి కోరారు.

మంత్రి తుమ్మలకు డీసీసీబీ చైర్మన్ వినతి
నల్లగొండ, జూలై 4: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి ప్రభుత్వం నుంచి అధిక నిధులు కేటాయించాలని వ్యవసాయ, కోఆపరేటివ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీసీసీబీ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కోరారు. అనంతరం మంత్రిని బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, డైరెక్టర్లు సన్మానించారు.