Share News

సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల మాసోత్సవాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:42 AM

ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని అన్ని సహకా ర బ్యాంకుల్లో రెండు మాసాల పాటు డిపాజిట్ల మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నూతన క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించి మాట్లాడారు.

సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల మాసోత్సవాలు

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

నల్లగొండ, జనవరి 8: ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని అన్ని సహకా ర బ్యాంకుల్లో రెండు మాసాల పాటు డిపాజిట్ల మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నూతన క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం డీసీసీబీలో రూ.665కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, జనవరి, ఫిబ్రవరి నెలలో డిపాజిట్ల మాసోత్సవాల సందర్భంగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్స రం ముగిసేందుకు మరో మూడు నెలలే ఉన్నందున, ప్రతీ ఉద్యోగి, అధికారి డిపాజిట్లపై దృష్టి సారించాలన్నారు. డిపాజిట్లకు రైతులు, ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటి వర కు బ్యాంకు నుంచి రూ.302కోట్ల మేర బంగారంపై రుణాలు గ్రాముకు రూ.4500 చొప్పు న ఇచ్చామన్నారు. 333రోజుల డిపాజిట్‌కు వడ్డీ 7.75శాతం చెల్లిస్తామన్నారు. అదేవిధం గా 111రోజుల డిపాజిట్‌ వడ్డీ 6.50శాతం ఇస్తామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, గుడిపాటి సైదులు, అంజయ్య, రంగాచారి, రామాచారి, జైరాం, బంటు శ్రీను, కరుణ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

సీఈవో పోస్టుకు 14 దరఖాస్తులు

జిల్లా సహకార బ్యాంకు సీఈవో పోస్టుకు 14 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం పనిచేస్తున్న సీఈవో మదన్‌మోహన్‌ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు డీసీసీబీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుకు నాబార్డుకు చెందిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈనెల 18, 19, 20 తేదీల్లో ఏదో ఒకరోజు ఇంటర్వ్యూలు నిర్వహించి సీఈవోను ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.

Updated Date - Jan 09 , 2024 | 12:42 AM