వ్యక్తి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
ABN , Publish Date - Mar 13 , 2024 | 12:23 AM
భువనగిరి పట్టణ శివారులోని మాసుకుంటకు చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు.
భువనగిరి రూరల్, మార్చి 12: భువనగిరి పట్టణ శివారులోని మాసుకుంటకు చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మాసుకుంటకు చెందిన దుబ్బాసి విజయ్(32) ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5.30గంటలకు తనకు హైదరాబాద్‌లో టెంపరరీ డ్రైవింగ్ ఉందని, తన బైక్ కూడా అక్కడే ఉందని అది తీసుకొని మూడు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత అతని సెల్‌కు చేయగా స్విచ ఆఫ్ అని వచ్చింది. ఆచూకీ కోసం బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా సమాచారం లభించలేదు. విజయ్ అతని సోదరుడు అజయ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తెలిసిన వారు సెల్: 8712662472 నెంబర్‌కు సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.