Share News

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:00 AM

పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో అఽభ్యర్థులకు భువనగిరి జిల్లా ఆస్పత్రిలో సోమవారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి.

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు వైద్య పరీక్షలు

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 5: పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో అఽభ్యర్థులకు భువనగిరి జిల్లా ఆస్పత్రిలో సోమవారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాచకొండ కమిషనరేట్‌లోని 600 మంది అభ్యర్థులకు ఐదు రోజుల పాటు 11మంది వైద్యులతో పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు 120 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్యోగాల ఎంపికకు తుది పరీక్షగా పేర్కొనే వైద్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డీసీపీ ఎం. రాజే్‌షచంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చిన్నానాయక్‌ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏసీపీ సీహెచ్‌ మహేశ్వర్‌, సీఐ వెంకటేశ్‌ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

Updated Date - Feb 06 , 2024 | 12:00 AM