Share News

ప్రజల సుఖసంతోషాల కోసం మహాలక్ష్మీయాగం

ABN , Publish Date - May 24 , 2024 | 11:54 PM

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మట్టపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మినృసింహుని క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మియాగం నిర్వహించారు.

ప్రజల సుఖసంతోషాల కోసం మహాలక్ష్మీయాగం
మఠంపల్లి క్షేత్రంలోమహాలక్ష్మీయాగం

మఠంపల్లి, మే 24 : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మట్టపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మినృసింహుని క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మియాగం నిర్వహించారు. లోకక్షేమం, ప్రజల సుఖసంతోషాల కోసం వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో దేవస్థాన పాలక మండలి పర్యవేక్షణలో ఈ యాగాన్ని శాసో్త్రక్తంగా వేదపండితులు నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, దేవతల సాక్షిగా ఈ క్షేత్రంలో మహాయాగం ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో నవీన, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాసి్త్ర, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, రాజేష్‌, రమేష్‌ దేవస్థాన పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మాత్సవాల్లో నాల్గో రోజు

మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణోత్సవాలు నాల్గో రోజైన శుక్రవారం కొనసాగాయి. ఉదయం 6 గంటలకు ప్రాతఃకాలార్చన, సుప్రభాతం, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మూలవిరాట్‌కు అభిషేకం, అర్చన, మంత్రపుష్ప నీరాజనం, ఉదయం 9 గంటలకు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో మహాలక్ష్మీయాగం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు కృష్ణానదీలో హంసవాహన ఉత్సవం, విద్యుత, పూలఅలంకరణతో వైభవంగా నిర్వహించారు. సప్తర్షి పూజ, సదస్య మహోత్సవం, మహదాశీర్వచన, ఫలప్రదాన మహోత్సవాన్ని పండితులు కన్నుల పండువగా జరిపించారు.

Updated Date - May 24 , 2024 | 11:54 PM