Share News

జోరుగా నామినేషన్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:39 PM

లోక్‌సభ సమరంలో నామినేషన్ల ఘట్టం ఊపందుకుంది. నల్లగొండ, భువనగిరి స్థానాలకు ప్రఽధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తుండగా, ఆయా పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు కొనసాగుతున్నాయి.

జోరుగా నామినేషన్లు

జాతీయ, రాష్ట్రనేతల రాకతో సందడి

అంతా తామై వ్యవహరిస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు

ఉమ్మడి జిల్లా నుంచే బస్సుయాత్ర ప్రారంభించనున్న మాజీ సీఎం కేసీఆర్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): లోక్‌సభ సమరంలో నామినేషన్ల ఘట్టం ఊపందుకుంది. నల్లగొండ, భువనగిరి స్థానాలకు ప్రఽధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తుండగా, ఆయా పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు కొనసాగుతున్నాయి. జాతీయ, రాష్ట్ర నేతల రాకతో ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమరం సందడిగా కొనసాగుతోంది.

భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి చామలకిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోరుతూ ఈ నెల 21న నిర్వహించిన బహిరంగసభకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ సందర్భం గా మంగళవారం నిర్వహించిన ర్యాలీకి కేంద్రమంత్రి జైశంకర్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామమల్లేశ్‌ ఈ నెల 22న నామినేషన్‌ దాఖలు చేయగా, భువనగిరి లో భారీ ర్యాలీ నిర్వహించారు. భువనగిరి నుంచి బరిలో ఉన్న సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ జాతీయనేత బీవీ.రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రం గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరై, ర్యాలీలో పాల్గొన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం భారీ ర్యాలీతో నా మినేషన్‌ దాఖలు చేశారు. ఈ ర్యాలీలకు మాజీమంత్రి జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన తరఫున నిర్వహించిన ర్యాలీకి కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు హాజరయ్యారు. కాం గ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖ లు చేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 29తో నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో ఇక ప్రచారం వేగం పుంజుకోనుంది. ప్రచారానికి సంబంధించి ప్రధా న పార్టీల అభ్యర్థుల తరఫున ఏ కీలకనేతలను తీసుకురావాలనే అంశంపై ఇప్పటికే ఆయా పార్టీలు స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాయి.

గెలుపు బాధ్యతలు మంత్రులు, మాజీ మంత్రులకు

కాంగ్రెస్‌ తరఫున రెండు సీట్ల నుంచి అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభకు పార్టీ ఇన్‌చార్జి కూడా కావడంతో ఆయన నేతృత్వంలో ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. భువనగిరి లోక్‌సభ స్థానానికి తొలుత మంత్రి కోమటిరెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగినా, ఇటీవల ఆయన సోదరుడు ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహం తో పాటు, ప్రతిపక్షాలకు కౌంటర్‌గా మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో కుందూరు జానారెడ్డి తెరవెనుక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలను సమన్వయం చేయడంతో పాటు, తనకున్న విస్తృత సంబంధాలతో కుమారుడి కోసం ఆయన పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి ప్రచార బాఽధ్యతలు భుజానవేసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంతో పాటు, అధికార పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తూ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాలతో పాటు, నామినేషన్ల ర్యాలీలను పూర్తిచేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌షో అనంతరం అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి జిల్లాపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. అభ్యర్థుల ఎంపికలో భిన్నత్వాన్ని ప్రదర్శించిన ఆ పార్టీ గెలుపుకోసం జాతీయనాయకత్వాన్ని రంగంలోకి దించింది. నామినేషన్ల ర్యాలీలకు కేంద్రమంత్రులు హాజరవగా, ఇప్పటికే ఆర్‌ఎ్‌సఎ్‌సకు చెందిన కీలకనేతలు తెరవెనుక ఉండి ఎప్పటికప్పుడు వ్యూహాల ను అభ్యర్థులకు అందిస్తూ ప్రచార వేగం తగ్గకుండా చూస్తున్నారు.

నేటి నుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లాను చుట్టేసిన ఆయన కృష్ణాజలాల సాధనలో ప్రభుత్వ వైఫల్యం, కరువుకు కాంగ్రెసే కారణమనే అంశాలను తెరమీదకు తెచ్చారు. తాజాగా, జిల్లాలోని మిర్యాలగూడ నుంచే బుధవారం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. బస్సుయాత్ర ద్వారా బుధవారం నల్లగొండ లోక్‌సభ పరిధిలోని మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్‌షో నిర్వహించి ప్రసంగించనున్నారు. గురువారం భువనగిరి లోక్‌సభ పరిధిలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు.

ఐదు రోజు 26 నామినేషన్లు

ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు దాఖలు

నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

నల్లగొండ, భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 23: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఐదో రోజైన మంగళవారం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 8 మంది అభ్యర్థులు 9సెట్ల నామినేషన్లను దాఖలుచేశారు. వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా, మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు. బీఆర్‌ఎస్‌ తరుపున ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎస్‌జేపీ(సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) తరుపున సుంకర లింగయ్య ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్‌ సంపంగి, రేళ్ల పెద్దనరసింహారావు, సుంకరి రమేష్‌, అబ్ధుల్‌ మాలిక్‌, కిన్నెర యాదయ్య, పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఒక్కో సెట్‌ నామినేషన్‌ దాఖలుచేశారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నెర యాదయ్య ఈ నెల 9న ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసి, తిరిగి ఈ రోజు మరో సెట్‌ దాఖలు చేశారు.

ఫ భువనగిరి నియోజకవర్గానికి 18 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ రెండో సెట్‌ నామినేషన్‌ వేశారు. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ మూడోసెట్‌, సీపీఎం అభ్యర్థిగా బట్టుపల్లి అనురాధ ఒక సెట్‌, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థిగా ఎర్ర సూర్యం ఒక సెట్‌, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా పెంట రమేష్‌, బహుజన లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థిగా నూనె వెంకటస్వామి, బ్లూ ఇండియా పార్టీ అభ్యర్థిగా డప్పు వీరస్వామి ఒక సెట్‌, పీపుల్‌ ప్రొటెక్షన్‌ పార్టీ అభ్యర్థిగా ఉంద్యాల సదానందరెడ్డి మూడోసెట్‌, ఆధార్‌ పార్టీ అభ్యర్థిగా తాళ్లపల్లి రమే్‌షగౌడ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా ఊదరి మల్లేష్‌ మూడోసెట్‌, పోతుల యాదగిరి ఒక సెట్‌, ఆరూరి వెంకటేశం ఒక సెట్‌, కారింగుల యాదగిరి ఒకసెట్‌, రేకల సైదుల రెండో సెట్‌, బొల్లారం బాలరాజు ఒకసెట్‌, బూషపాక వెంకటయ్య ఒక సెట్‌, సంజీవులు ఒకసెట్‌, జంగా సుజాత ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్‌ కౌంటర్‌

నియోజకవర్గం 23న గతంలో మొత్తం

దాఖలు దాఖలు

నల్లగొండ 8 25 33

భువనగిరి 18 24 42

మొత్తం 26 49 75

Updated Date - Apr 23 , 2024 | 11:39 PM