Share News

కేసీఆర్‌ను కలిసేందుకు తరలివచ్చిన శ్రేణులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:29 PM

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం సూర్యాపేటలోని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి క్యాంప్‌ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చారు.

కేసీఆర్‌ను కలిసేందుకు తరలివచ్చిన శ్రేణులు
సూర్యాపేటలో పార్టీ శ్రేణులతో కేసీఆర్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌)/ అర్వపల్లి/ తిరుమలగిరి, ఏప్రిల్‌ 25: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం సూర్యాపేటలోని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి క్యాంప్‌ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి రోడ్‌ అనంతరం ఇక్కడే ఆయన బసచేశారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు అధినేతను కలుసుకునేందుకు తరలిరాగా, మధ్యాహ్నం తర్వాత నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను కేసీఆర్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగదీ్‌షరెడ్డి ప్రతి ఒక్కరినీ కేసీఆర్‌కు పరిచయం చేశారు. సాయంత్రం 4 గంట లకు ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గంలో భువనగిరికి బయలుదేరివెళ్లారు.

పూలుచల్లి స్వాగతం

మాజీ సీఎం కేసీఆర్‌కు అర్వపల్లి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి వాహనశ్రేణిపై పూలచల్లి అభిమానం చాటు కున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, గుండగాని సోమే్‌షగౌడ్‌, మొరి శెట్టి ఉపేందర్‌, బైరబోయిన రామలింగయ్య, విజయ్‌, కడారి నర్సయ్య, పాల్గొన్నారు. అదేవిధ ంగా తిరుమలగిరికి చేరుకోగానేపార్టీ శ్రేణులు పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. బస్‌లో నుంచే కేసీఆర్‌ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంకెపల్లి రఘునందనరెడ్డి, కల్లెట్లపల్లి శోభనబాబు, నరేష్‌, నాని పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:29 PM