బీఆర్‌ఎస్ భూకబ్జాలపై న్యాయపోరాటం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:29 AM
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుచరులకు రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని,ఆయా భూకబ్జాలపై న్యాయ పోరాటం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు అన్నారు.

చివ్వెంల, జూలై 4: మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుచరులకు రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని,ఆయా భూకబ్జాలపై న్యాయ పోరాటం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కుడకుడ రెవెన్యూ శివారు సర్వే నెంబరు 126లో బీఆర్‌ఎస్ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన చేసుకున్న భూమిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూకబ్జాల విషయంపై త్వరలోనే కోర్టుకు వెళ్తామన్నారు. పట్టణంలో పదేళ్లుగా బీఆర్‌ఎస్ నాయకుల భూదందా విపరీతంగా పెరిగిందన్నారు. కలెక్టరేట్ భవనానికి ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన స్థలాన్ని బడా నేతలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. స్థానిక నేతలతో పాటు అతడి బంధువులకు, నాగారం గ్రామస్థులకు కుడకుడలో పట్టా చేయడంఏంటని ప్రశ్నించారు. సర్వేనెం.126తో పాటు 817, 816, 818లలో ఉన్న ఇనాం భూములను కబ్జా చేశారని, 817లో 38 గుంటల భూమి పూర్తిగా కబ్జాకు గురైందన్నారు. అనుకూలమైన వారికి 1000 గజాలకు పైగా రిజిస్ట్రేషన చేశాడన్నారు. బినామీలు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీమంత్రి బంధువులకు,అనుచరులకు పట్టాలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన సమగ్ర విచారణ చేసి బాధ్యులపై, వీరికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి కలెక్టర్ వెంకటరావు అక్రమార్కులకు సహకరించడం దుర్మార్గమన్నారు. ఆయన్ను సస్పె ండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రైవేట్, అర్హతలేని వ్యక్తులకు దగ్గరుండి రిజిస్ట్రేషన చేసిన వెంకటరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పేరాల లక్ష్మణ్‌రావు, అబీద్, చల్లమల్ల నర్సింహ, ధరావత శ్రీనివా్‌సనాయక్ ఉన్నారు.