Share News

వైటీడీఏ పనులకు నిధుల కొరత

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:53 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి కొండపైన పాత నిర్మాణాలు తొలగించి ఆలయం మిన హా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గత ప్రభు త్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా భక్తుల కొండకింద దుకాణ సముదాయాల నిర్మాణాలను మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టింది.

వైటీడీఏ పనులకు నిధుల కొరత

నిలిచిన దుకాణసముదాయాల నిర్మాణాలు

ఆర్టీసీ బస్టాండ్‌ పనులు రూ.5 కోట్ల మేర పెండింగ్‌

భువనగిరి అర్బన్‌ : యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి కొండపైన పాత నిర్మాణాలు తొలగించి ఆలయం మిన హా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గత ప్రభు త్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా భక్తుల కొండకింద దుకాణ సముదాయాల నిర్మాణాలను మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు చివరిదశలో నిధుల కొరతతో నిలిచాయి. ఎన్నికల కోడ్‌ ముగుస్తున్న నేపథ్యంలో నిధులు విడుదల అవుతుండొచ్చని వైటీడీఏ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇదే తరుణంలో 2026 వరకు కొండపై వర్తకం నిర్వహించేందుకు కోర్టు స్టే ద్వారా వర్తకులు అనుమతి పొందారు. ఈ మేరకు తాత్కాలికం గా 10 దుకాణాలు విష్ణు పుష్కరిణి ఎదురుగా ఉన్న అండర్‌పా్‌సతో పాటు ఆ పరిసరాల్లో గుడారాలు ఏర్పాటుచేసుకోగా, భక్తుల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

భక్తుల సౌకర్యార్థం కావాల్సిన నిర్మాణాలు కొండకింద చేపట్టేందుకు గండి చెరువు నుంచి ఊరకుంట చెరువు వరకు రెండు విడతల్లో 73, 78 నుంచి 119 సర్వేనంబర్ల వరకు తొలి విడతలో 93.03 ఎకరాలు, మలివిడతలో 49.24ఎకరాలు కలిపి 142.27 ఎకరాల వ్యవసాయ భూములను అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో తేపోత్సవం(గండి చెరువు) లక్ష్మీపుష్కరిణిని, ఆర్టీసీ బస్టాండ్‌, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, సత్యదేవుడి వ్రత మండపం, కొండపైన వ్యాపారులు, కొండకింద రోడ్డు బాధితుల కోసం దుకాణ సముదాయాలు నిర్మించగా, మిగిలిన భూములను పార్కింగ్‌ కోసం కేటాయించారు.

కోర్టు స్టేతో 10 దుకాణాలు

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన దుకాణాలు ఖాళీ చేయించగా జీవనోపాధి కోల్పోయామని వర్తకులు కోర్టును ఆశ్రయించగా కొండపైన 2026 వరకు 10 దుకాణాలకు కోర్టు అనుమతించింది. హోటళ్లు, కొబ్బరికాయల దుకాణాలు, జనరల్‌ దుకాణాలు, బొమ్మల దుకాణాలు, ఫొటో స్టూడియో తాత్కాలికంగా ఏర్పాటుచేసుకోగా, భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారానే 112 మంది వర్తకులు ఇక్కడ విడ తల వారీగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

కొండకింద దుకాణ సముదాయాలు

దుకాణదారుల కోసం కొండకింద అన్నదాన సత్రం సమీపంలో 162దుకాణ సముదాయాలకు రూ.13కోట్లు కేటాయించగా, రూ.8కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.5కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 166(నిర్వాసితుల కోసం బస్టాండ్‌ పక్కన వేరుగా) దుకాణ సముదాయాల కోసం రూ.60కోట్లు మంజూరు కాగా, రూ.50కోట్ల పనులు పూర్తయ్యాయి. రూ.10కోట్లతో నిర్మించాల్సిన ఆర్టీసీ బస్టాండ్‌ పనుల్లో రూ.5కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్‌ ముగుస్తున్న నేపథ్యంలో నిధులు మంజూరు కావొచ్చని వైటీడీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ దుకాణాల ఏర్పాటు స్థలాభావం కారణంగా విష్ణుపుష్కరిణి ఎదురుగా భక్తులు కాలినడకన వెళ్లే దారి(అండర్‌పా్‌స) లో ఏర్పాటుచేశారు. శివాలయం, ప్రసాదాల కౌంటర్‌, ప్రధానాలయానికి తూర్పుదిక్కు నుంచి భక్తులు నడిచే ప్రధాన దారి వెంట అండర్‌పా్‌సలో ఏర్పాటుచేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రద్దీ దినాల్లో ఈ దారి వెంట భక్తులు నడవలేకపోతున్నారు. నిధులు విడుదల కాగానే చివరి దశ పనులు పూర్తి చేస్తామని వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత కొండకిందకు తరలించాల్సి దుకాణాలను అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని ఆలయ పరిపాలన విభాగం ఏఈవో గట్టు శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

దుకాణ సముదాయాలు దేవస్థానం ఆధీనంలోకి రాలేదు- శ్రావణ్‌, గుట్ట దేవస్థానం పరిపాలన విభాగం ఏఈవో

కొండకింద నిర్మించిన దుకాణసముదాయాలు వైటీడీఏ నుంచి దేవస్థానం ఆధీ నంలోకి రాలేదు. ప్రస్తు తం 2026 వరకు కొండపైన నిర్వహించుకునేందుకు కోర్టు స్టే ఉంది. 10దుకాణాలకు నెలవారీగా అద్దె రూ.12లక్షలతో పాటు జీఎస్టీ రూ.2,40,000 చెల్లిస్తున్నారు. దుకాణ సముదాయాల అప్పగింత, విధించి న కోర్టు స్టే ఎత్తివేత ప్రక్రియలు పూర్తి కాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.

నిధులు విడుదల కాగానే పనులు పూర్తి చేసి అప్పగిస్తాం..

162 దుకాణ సముదాయాల చివరిదశ పనులు నిధుల కొరతతో నిలిచాయి. నిధులు రాగానే పనులు పూర్తి చేసి అప్పగిస్తాం.అదేవిధంగా కొండకింద బస్టాండ్‌ పక్కన రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కోసం 166దుకాణ సముదాయాలు కూ డా నిర్మాణంలో ఉన్నాయి. నిధుల్లేక పెండింగ్‌లో ఉండ గా సముదాయాల్లో పనులు పూర్తి కాగానే దేవస్థానం స్వాధీనం చేస్తాం.

- వెంకటేశ్వరరెడ్డి,వైటీడీఏ ఈఈ

Updated Date - Jun 08 , 2024 | 11:53 PM