Share News

కేఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:14 AM

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కేఆర్‌ (కట్కూరి రామచంద్రారెడ్డి) ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు కొనియాడారు.

కేఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
కట్కూరి దంపతుల విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నాయకులు

ఆలేరు రూరల్‌/ మోత్కూరు, జనవరి 6: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కేఆర్‌ (కట్కూరి రామచంద్రారెడ్డి) ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు కొనియాడారు. శనివారం ఆలేరులోని బస్టాండ్‌ వద్ద కట్కూరి దంపతుల 42వ వర్థంతి నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ స్వాముల పాలన నుంచి పీడిత ప్రజలను విముక్తి చేసేందుకు కట్కూరి దంపతుల చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఆనాటి దొరలు విసునూరు దేశముఖ్‌ గూండాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజా ఉద్యమాలను నిర్వహించారని కొనియాడారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచి పోరాడిన గొప్ప నేతలు అని, కేఆర్‌ మార్గంలో ప్రజలంతా నడువాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా, మండల నాయకులు చెక్క వెంకటేష్‌, కట్కూరి రాంగోపాల్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, కళ్లెం కృష్ణ, ముత్యాలు, గొట్టిపాముల రాజు, ధాన్యనమ్మ ఉన్నారు. కట్కూరి రాంచంద్రారెడ్డి, సుశీల దంపతుల జీవితం ఆదర్శనీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేఆర్‌ 42వ వర్ధంతి సందర్భంగా శనివారం మోత్కూరు కేఆర్‌ భవనలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు పర్యాయాలు ఆయన రామన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల్లో చేరాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అన్నెపు వెంకట్‌, పుల్క రం మల్లేష్‌, గీతపనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, నాయకులు టి.లక్ష్మీనర్సయ్య, గొలుసుల యాదగిరి, పోచం కన్నయ్య, పెండెం వెంకటేశ్వర్లు, కడమంచి వీరస్వామి, పస్తం లక్ష్మణ్‌, ఆర్‌.కొమురయ్య, ప్రశాంత పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:14 AM