Share News

నిస్వార్థ సేవకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:39 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం పరితపించిన నిస్వార్థ సేవకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. శనివారం ఆలేరులో ఆయన వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల లువేసి నివాళులర్పించారు.

నిస్వార్థ సేవకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆలేరు రూరల్‌,సెప్టెంబరు 21: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం పరితపించిన నిస్వార్థ సేవకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. శనివారం ఆలేరులో ఆయన వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల లువేసి నివాళులర్పించారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన ఇలాంటి నాయకులు ఉండడంచాలా అరుదు అన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరులో నేతన్నల కు చేయూత పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని 1,862 మంది చేనేత కార్మికులకు 11 నెలల బకాయిలను రూ.18.60కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే తమ అభిమతమన్నారు. ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆలేరు తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు గంధమల్ల అశోక్‌, చీర శ్రీశైలం, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఆలేరు మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, నీలం పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 12:39 AM