Share News

సాయుధ పోరాటానికి కొమరయ్య ఆద్యుడు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:32 AM

భూమి, భుక్తి కోసం చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసిందని, ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన దొడ్డి కొమరయ్య అందుకు ఆద్యుడిగా నిలిచారని అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ అన్నారు.

సాయుధ పోరాటానికి కొమరయ్య ఆద్యుడు
దొడ్డి కొమరయ్య చితపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

నల్లగొండ టౌన్‌, జూలై 4: భూమి, భుక్తి కోసం చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసిందని, ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన దొడ్డి కొమరయ్య అందుకు ఆద్యుడిగా నిలిచారని అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ అన్నారు. గురువారం దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కొమరయ్య ఆద్యుడిని అన్నారు. అలాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి, హౌసింగ్‌ పీడీ, బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి రాజ్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో మోతిలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:32 AM