కాళేశ్వరంపై సీబీఐ విచార ణ చేయించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:29 AM
కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు, భూమాఫియాపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి చింతల రామచంద్రారెడ్డి
రామగిరి, జనవరి 11: కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు, భూమాఫియాపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ సీబీఐతో ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రె్‌సను ప్రజా కోర్టులో నిలబెడతామన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు రూ.85వేల కోట్ల వ్యయం అవుతుందని, అందుకు నిధులు ఎక్కడ నుంచి తెస్తారో శ్వేతపత్రం విడుదల చేయలన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీబీఐ విచారణ గురించి ప్రశ్నిస్తే మంత్రి ఉత్తమ్ మాట్లాడిన తీరు సరైనది కాదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ఎంత సమయంలో పూర్తి చేస్తారో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందనే ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టారన్నారు. తెలంగాణ అభివృద్ధికి తొమ్మిదేళ్లలో రూ.9లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. రైతు బంధు కోసం బ్యాంకులో ఉన్న రూ.7,700కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. నెలరోజులు దాటినా రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీల అమలు ఎన్నికల కోడ్ వచ్చే వరకు జాప్యం చేయొద్దన్నారు. సమావేశంలో పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధరెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, గార్లపాటి జితేందర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, నాగం వర్షిత్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య, బాబా, నివేదితరెడ్డి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.