Share News

కమీషన్ల కోసం కక్కుర్తి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:26 AM

కమీషన్ల కోసం ఆర్‌ఎంపీలు దారుణాలకు ఒడిగడుతున్నారు.

కమీషన్ల కోసం కక్కుర్తి

అబార్షనలు చేయిస్తున్న ఆర్‌ఎంపీలు

సహకరిస్తున్న ఆశావర్కర్లు, ఏఎనఎంలు?

ప్రైవేట్‌ వైద్యుల ఫీజులో 50 శాతం వసూలు?

చివ్వెంల, జూలై 4 : కమీషన్ల కోసం ఆర్‌ఎంపీలు దారుణాలకు ఒడిగడుతున్నారు. కుమారుడి కోసం ఆరాటపడే జంటలే లక్ష్యంగా స్కానింగ్‌ చేయిస్తూ, ఆడశిశువు అని తేలితే అబార్షనలు చేయిస్తున్నారు. ఇందుకోసం వైద్యులను సంప్రదించి కమీషన్లు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల మండలంలోని ఎంజీనగర్‌తండాకు చెందిన సుహాసినికి గర్భస్రావం చేస్తుండగా వికటించి మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. ఇందులో ఓ ఆర్‌ఎంపీతో పాటు నర్సు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. ఏడో నెలలో గర్భస్రావం చేయడానికి కూడా వెనుకావడం లేదు. ఇందుకు సుహాసిని ఉదంతమే ఉదాహరణ. ఈ కేసు కాక చివ్వెంల మండలంలో ఇలా అబార్షనలు చాలా జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కొందరు ఆర్‌ఎంపీలు, ఏఎనఎంలు, ఆశాకార్యకర్తలు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గైనకాలజి్‌స్టల వద్దకు కమీషన్లు కోసం ఏఎనఎంలు, ఆశావర్కర్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. చివ్వెంల మండలంలో అధికంగా తండాలు ఉన్నాయి. కమీషనకు కక్కుర్తిపడిన పడిన ఓ రెండో ఏఎనఎం చివ్వెంల సమీప గ్రామాల్లోని తండాల్లో మరో ముగ్గురు ఏఎనఎంలు, కొందరు ఆశావర్కర్లు ప్రైవేట్‌ వైద్యుల వద్దకు గర్భిణులను తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో అంతోఇంతో ఆస్తి ఉండి మొదటి రెండు సంతానంలో ఆడపిల్లలు పుట్టిన వారు మూడో సంతానంలో మగబిడ్డ కోసం గర్భం దాల్చిన వారిని లక్ష్యంగా చేసుకుని సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి నుంచి రూ.వేలల్లో వసూలు చేసి స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ చేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా హెచ్చరికలు చేసి వదిలేస్తుండటంతో అబార్షన్ల తంతు కొనసాగుతోంది.

50 శాతం కమీషన

లింగ నిర్ధారణ, గర్భస్రావం కోసం తీసుకెళ్తున్న వారి నుంచి ఆర్‌ఎంపీలు, ఏఎనఎం, ఆశావర్కర్లు సంబంధిత వైద్యుల వద్ద ఫీజులో కమీషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 50 శాతం కమీషన ఇస్తుండటంతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తమ పేర్లు బయటకు రాకుండా ఆసుపత్రి రిజిస్టర్లలోనూ గర్భిణుల పేర్లు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఇటీవల సుహాసిని ఉదంతంతో వీరి వ్యవహార శైలి వెలుగుచూసింది.

Updated Date - Jul 05 , 2024 | 12:26 AM