Share News

రామన్నపేట ఎంపీపీ పదవికి జ్యోతి రాజీనామా

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:19 AM

రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి తన పదవికి రాజీనామా చేశారు.

రామన్నపేట ఎంపీపీ పదవికి జ్యోతి రాజీనామా
జడ్పీ సీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీపీ జ్యోతి

రామన్నపేట, మార్చి 28: రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి తన పదవికి రాజీనామా చేశారు. జడ్పీ సీఈవో శోభారాణిని గురువారం కలిసిన ఆమె తన రాజీనామా లేఖను అందించారు. కక్కిరేణి ఎంపీటీసీగా గెలుపొందిన ఆమె ఎంపీపీగా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్‌, ఇతర ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించడంతో ఈ నెల 30వ తేదీన అవిశ్వాస తీర్మానం ఉంది. అవిశ్వాసానికి ముందే ఎంపీపీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత సీఈవో శోభారాణి మాట్లాడుతూ ఎంపీపీ రాజీనామా లేఖ కలెక్టర్‌ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. ఎంపీపీ జ్యోతి మాట్లాడుతూ తనకు నాలుగున్నర సంవత్సరాలు పా టు సహకరించిన ఎంపీటీసీ సభ్యులు, నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:19 AM