Share News

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:42 AM

కలుషిత ఆహారం తిని మృతి చెంది న విద్యార్థి చినలచ్చి ప్రశాంత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యా ర్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి

గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 17: కలుషిత ఆహారం తిని మృతి చెంది న విద్యార్థి చినలచ్చి ప్రశాంత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యా ర్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మే రకు జిల్లాకేంద్రంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ పాఠశాల నిర్వహణలో లోపించిన ప్రమాణాలు, పర్యవేక్షణ ఫలితంగానే ప్రశాంత్‌ మృతి చెందాడని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గురుకుల సొసైటీ ఆర్‌సీవో రజిని, డీఈవో డాక్టర్‌ కె.నారాయణరెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రమాణాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా కలుషిత ఆహారం ఘటన కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా చేయగా, వారికి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు.

ప్రశాంత్‌ది ప్రభుత్వ హత్యే : బీజేపీ ఎస్సీ మోర్చా

కలుషిత ఆహారంతో మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్‌ది ప్రభుత్వ హత్యేనని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ప్రశాంత్‌ మృతికి సంతాపం గా బుధవారం భువనగిరిలో నివాళులర్పించారు. ప్రశాంత్‌ కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కలుషి త ఆహార ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు బుగ్గ దేవందర్‌, పట్టణ అధ్యక్షుడు దాసరి స్వామి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మేడి కోటేష్‌, కోళ్ల భిక్షపతి, ఎర్రవెల్లి నాగరాజు, బరిగె ల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌, భట్టు రాంచంద్రయ్య, కర్తాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా

భువనగిరి అర్బన్‌: విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆరా తీసేందుకు అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే బుధవారం తెలిపారు. తుర్కపల్లి, భూదాన్‌పోచంపల్లి తహసీల్దార్లు దేశ్యా, శ్రీకాంత్‌రెడ్డి, భువనగిరి ఏరియా ఆస్పత్రి భువనగిరి తహసీల్దార్‌ అంజిరెడ్డిలను పర్యవేక్షణకు నియమించగా చికిత్స అందించేందుకు వై ద్యాధికారులు డాక్టర్‌ విజయ్‌, యశోదలతోపాటు ఉపాధ్యాయులు శ్రీనివా్‌సరెడ్డి, వెంకన్న, హరిశంకర్‌ నిరంతరం పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్లు తెలిపారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రశాంత్‌ మృతి: బీజేపీ

రామన్నపేట, అడ్డగూడూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రశాంత్‌ కలుషిత ఆహారం తిని మృతిచెందాడని బీజేపీ మండల అధ్యక్షుడు పలపు దుర్గయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత్‌ మృతికి కారణమైన హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని, ఫుడ్‌ కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలన్నారు. అదే విధంగా అడ్డగూడూరులో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 12:42 AM