పెద్దన్న మోదీతోనే మాదిగలకు న్యాయం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:47 PM
మాదిగలను అనాదిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసగిస్తున్న నేపథ్యంలో దేశ పెద్దన్న, ప్రధాని నరేంద్రమోదీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

మాదిగలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసగించాయి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
భువనగిరి టౌన్, మార్చి 6: మాదిగలను అనాదిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసగిస్తున్న నేపథ్యంలో దేశ పెద్దన్న, ప్రధాని నరేంద్రమోదీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం అణువంత కృషి కూడా చేయలేదని విమర్శించారు. మాదిగలకు జరుగుతున్న నష్టాన్ని తీర్చే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు చేపట్టిన చట్టపరమైన చర్యలు, హైదరాబాద్‌లో జరిగిన మాదిగల శంఖారావ సభలో నేరుగా పాల్గొన్న తీరు మాదిగల అభివృద్ధికి ఆయన చూపుతున్న శ్రద్ధను తెలియజేస్తున్నదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మాదిగలు అండగా నిలిచి పెద్దన్న మోదీని మూడోసారి ప్రధాని చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.