Share News

ఇంటర్నేషనల్‌ సైన్స ఫెస్టివల్‌కు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:12 AM

ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స ఫెస్టివల్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.

ఇంటర్నేషనల్‌ సైన్స ఫెస్టివల్‌కు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు
జాఫర్‌, సైదులు

మేళ్లచెర్వు, ఆలేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స ఫెస్టివల్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని కందిబండ జడ్పీహెచఎ్‌స పాఠశాల సైన్స ఉపాధ్యాయుడు షేక్‌ జాఫర్‌ ఎంపికయ్యారు. అసోం రాష్ట్రంలోని ఐఐటీ గౌహతిలో జరుగుతున్న ఈ నెల 30 నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జాతీయ పరిశోధన, శిక్షణ సంస్థ, కేంద్ర అణుశక్తి శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫెస్టివల్‌కు హాజరవుతున్నట్లు ఎంఈవో వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు అనిల్‌కుమార్‌ బుధవారం తెలిపారు. సైన్స బోధన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధ్యాయుల కార్యశాల అంశంలో జాఫర్‌ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాఫర్‌ను పలువురు అభినందించారు.

యాదాద్రి భువనగిరిజిల్లా ఆలేరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్రం ఉపాఽధ్యాయుడు రెడ్డిపల్లి సైదులు కూడా సైన్స ఫెస్టివల్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స ఫెస్టివల్‌కు తనను ఎంపిక చేసి ఆహ్వానం పంపడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సైదులను ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఎనసీసీ అధికారి దూడల వెంకటేష్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పూల నాగయ్య, స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు నారేంద్రస్వామి, ఉపాధ్యయులు పోరెడ్డి రంగయ్య, సత్యనారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 12:12 AM