Share News

అవిశ్వాస సమావేశాలకు వేళాయే..

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:02 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 19 మునిసిపాలిటీలకు ఎనిమిది పురపాలక సంఘాల్లో అవిశ్వాసానికి తెరలేపా రు. నల్లగొండ మునిసిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన చైర్మన్‌ సైదిరెడ్డి పదవిని కోల్పోయారు.

అవిశ్వాస సమావేశాలకు వేళాయే..

23న నేరేడుచర్ల, భువనగిరి మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాన సమావేశం

24న హుజూర్‌నగర్‌, 27న సూర్యాపేట, ఆలేరులో..

కోదాడ, నాగార్జునసాగర్‌పై కోర్టు స్టే

జడ్పీ చైర్మన్లపై కనిపించని అవిశ్వాసాలు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి, సూర్యాపేట)/నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 19 మునిసిపాలిటీలకు ఎనిమిది పురపాలక సంఘాల్లో అవిశ్వాసానికి తెరలేపా రు. నల్లగొండ మునిసిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన చైర్మన్‌ సైదిరెడ్డి పదవిని కోల్పోయారు. అదేవిధంగా కోదాడ, నాగార్జునసాగర్‌ మునిసిపాలిటీలకు సంబంధించి కోర్టుల్లో స్టే ఉండటంతో అవిశ్వాసంపై తదుపరి చర్యలు నిలిచిపోయాయి.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మునిసిపాలిటీలు ఉండగా అందులో సూర్యాపేట జిల్లాలో ఐదు, యాదాద్రిభువనగిరి జిల్లాలో ఆరు, నల్లగొండ జిల్లాలో ఎనిమిది ఉన్నాయి. 2020 లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మునిసిపాలిటీలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా ప్రస్తుతం తిరుమలగిరి మినహా అన్నింట్లోనూ అవిశ్వాస పర్వాలు మొదలయ్యాయి. సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌పై అవిశ్వాస నోటీసుపై ఈ నెల 27వ తేదీన సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మునిసిపాలిటీలో బీఆర్‌ఎ్‌సకు 30మంది కౌన్సిలర్లు ఉండగా అం దులో 15మంది తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశారు. కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష, వైస్‌చైర్‌పర్సన్‌ పద్మలపై కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. అయితే అధికారులు సరైన పద్ధతిలో నోటీసులు ఇవ్వలేదని వారిద్దరూ కోర్టుకు వెళ్లడంతో సమావేశం నిర్వహణకు జాప్యం జరిగింది. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అధికారు లు త్వరలో తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా హుజూర్‌నగర్‌ వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వర్‌రావుపై ఈ నెల 24వతేదీన అవిశ్వాసంపై ఓటింగ్‌ జరుగనుంది. నేరేడుచర్ల మునిసిపల్‌ చైర్మన్‌ జయబాబుపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అధికారులు ఈ నెల 23వ తేదీని నిర్ణయించారు. ఇక నల్లగొండ జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీలను 2020లో బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

నల్లగొండ మునిసిపాలిటీకి సంబంధించి ఈ నెల 8వ తేదీన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌కు ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగించారు. కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. అదేవిధంగా నందికొండ(నాగార్జునసాగర్‌) మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లపై అవిశ్వాసానికి నో టీసులివ్వగా వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. మిర్యాలగూడ, హాలియా, చండూరు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ పాలకవర్గాలు ఉన్నాయి. స్థాని క పరిస్థితుల దృష్ట్యా అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఇతర పార్టీలు లేవు. దేవరకొండ, చిట్యాల మునిసిపల్‌ చైర్మన్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో చే రడంతో ఇక్కడ అవిశ్వాసం సమస్య లేదు. నకిరేకల్‌ మునిసిపాలిటీకి ఏడాది ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం అవిశ్వాసానికి అవకాశం లేదు.

జిల్లాలో రెండు మునిసిపాలిటీల్లో..

యాదాద్రి జిల్లాలో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కురు, చౌటుప్పల్‌ మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ మునిసిపాలిటీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందుగానే కలెక్టర్లకు అవిశ్వాసం తీర్మాన నోటీసులను ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఒత్తిడితో నోటీసులు జారీచేయలేదు. ఎన్నికల అనంతరం మరోసారి అవిశ్వాసాలకు తెరలేపారు. భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్యలపై అవిశ్వాస నోటీసులపై ఈ నెల 23న ప్రత్యేక సమావేశానికి కలెక్టర్‌ ఆదేశా లు జారీ చేశారు. మొత్తం 35మంది కౌన్సిలర్లకు 31మంది అ విశ్వాసానికి మద్దతు నిలిచారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఆలేరు మునిసిపాలిటీ చైర్మన్‌ వస్పరి శంకరయ్యపై అవిశ్వాస సమావేశాన్ని ఈ నెల 27న నిర్వహిస్తున్నారు. మొత్తం 12మంది కౌన్సిలర్లలో 8మంది అవిశ్వాసానికి బలపరుస్తూ సంతకా లు చేశారు. ఆలేరులోనూ అవిశ్వా సం నెగ్గే అవకాశం ఉంది. యా దగిరిగుట్ట, చౌటుప్పల్‌ మునిసిపాలిటీల్లోనూ ఎన్నికలకు ముం దు అవిశ్వాసాలకు కలెక్టర్‌కు వి న్నవించారు. యాదగిరిగుట్ట, చౌటుప్ప ల్‌ మునిసిపల్‌ చైర్మన్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ఆయా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఉంటాయా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.

జడ్పీ చైర్మన్ల విషయంలో..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జడ్పీ చైర్మన్లపై అవిశ్వాసానికి సం బంధించి ఎటువంటి కదలికలు లేవు. యాదాద్రిభువనగిరి జిల్లా పరిషత్‌లో 17మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో 12 మంది బీఆర్‌ఎస్‌, 5మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు.కాగా ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ నుం చి ఏ ఒక్క జడ్పీటీసీ పార్టీ మారలేదు. కాంగ్రెస్‌ పా ర్టీకి చెందిన రామన్నపేట జడ్పీటీసీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌పై అ వి శ్వాసంపై ఇప్పటివరకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. సూర్యాపేట జిల్లాలో 2020లో జరిగిన ఎన్నికల్లో 23 మండలాలకు 20 మంది జడ్పీటీసీలు బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. గత ఎన్నికల సమయంలో కోదాడ నియోజకవర్గంలో ఆరుగురు జడ్పీటీసీలు, నేరేడుచర్ల జడ్పీటీసీ మొత్తం ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అవిశ్వాసానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో కాంగ్రెస్‌ లేదు. ఎన్నికల సమయంలో మొత్తం 31మండలాల జడ్పీటీసీల్లో కాంగ్రె్‌సకు 8మంది జడ్పీటీసీలు బలం ఉండగా, బీఆర్‌ఎస్‌ నుంచి 23మంది గెలిచారు. బీఆర్‌ఎ్‌సకి చెందిన బండా నరేందర్‌రెడ్డి పదవికాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. దీంతో అవిశ్వాసం పెట్టే ఆలోచనకు ఎవరు రాలేదు. ఇటీవల మారిన రాజకీయ బలాబలాను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిప్పర్తి, మునుగో డు జడ్పీటీసీలు కాంగ్రె్‌సలు చేరడంతో కాంగ్రెస్‌ బలం 10కిచేరగా,బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు 21 మంది ఉన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:02 AM