Share News

మంత్రి ప్రభాకర్‌ను విమర్శించడం సిగ్గుచేటు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:32 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీజేపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

మంత్రి  ప్రభాకర్‌ను విమర్శించడం సిగ్గుచేటు
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 17: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీజేపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి రాజకీయాల నుంచి తెలంగాణ కోసం పార్లమెంట్‌లో పోరాడిన బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకాంతో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో సేవలు అందిస్తున్న మంత్రిని విమర్శించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతీ గ్రామంలో అందరికీ ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల్లో కులగణనకు ఆమోదం తెలిపిందన్నారు. ఐదు గ్యారెంటీలు, 25 న్యాయాలతో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రకటించి అన్ని వర్గాలకు సమ న్యాయం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రతీ ఒక్కరి అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోసం చేసిన బీజేపీ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టి ఆదానీ, అంబానీలకు ఊడిగం చేస్తోందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి యువతను మోసం చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్‌, పటణ అధ్యక్షుడు భిక్షపతిగౌడ్‌, హేమేందర్‌గౌడ్‌, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:32 AM