Share News

‘ఉపాధి’ ఆన్‌లైన్‌ నమోదులో అక్రమాలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:10 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద మండలంలో చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నా యి. మండలంలో 31 పంచాయతీలుండగా 11 వేల జాబ్‌కార్డులున్నాయి.

‘ఉపాధి’ ఆన్‌లైన్‌ నమోదులో అక్రమాలు

కూలీలకు ఫొటోలకు కుదరని పొంతన

మస్టర్లలో ఇష్టమొచ్చిన ఫొటోలు, రాని కూలీలకు హాజరు

చివ్వెంల, ఏప్రిల్‌ 2 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద మండలంలో చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నా యి. మండలంలో 31 పంచాయతీలుండగా 11 వేల జాబ్‌కార్డులున్నాయి. అందులో 16 వేలకు పైగా కూలీలు ఉన్నట్లు సమాచారం. ఉపాధి పథకంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఒక్క ఫీల్డ్‌అసిస్టెంట్‌ సెల్‌ఫోన్‌ ద్వారా కూలీల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ మండలంలో కొందరు ఫీల్డ్‌అసిస్టెంట్లు, మేట్‌లు నిబద్ధతతో ఉద్యోగం చేస్తున్నా మరి కొందరు మాత్రం ఇష్టానుసారంగా హాజరు కాని కూలీలకు కూడా హాజరు వేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చివ్వెంల మండల కేంద్రంతో పాటు గాయంవారిగూడెం, వట్టిఖమ్మంపహడ్‌, తిమ్మాపురం, మోదిన్‌పురం గ్రామాల్లో మస్టర్లలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు వేరేవి కావడం, అందులో కూలీలు వేరే వారు ఉండడం విశేషం.

జరిగిన తప్పిదాలు

చివ్వెంలలో మార్చి 30వ తేదీన జరిగిన ఉపాధి పథకం పనుల్లో మస్టర్‌లో 10 మంది కూలీలు ఉం డగా ముగ్గురికి హాజరు వేసి అరచేతి ఫొటోను ఆ గ్రామానికి చెందిన మేట్‌ అప్‌లోడ్‌ చేశాడు. ఇదే గ్రా మంలో ఈ నెల 2వ తేదీన 80 మందికి పైగా కూలీ లు ఉన్న ఫొటో అప్‌లోడ్‌ చేసి 8 మందికి హాజరువేశాడు. 50 మందికి పైగా కూలీలు ఉన్న ఫొటోలను అప్‌లోడ్‌ చేసి ఓ మస్టర్‌లో ముగ్గురి, మరొక దాంట్లో నలుగురికి, ఇలా వారికి ఇష్టమొచ్చినట్లు హాజరు వేస్తున్నారు. గాయంవారిగూడెంలో ఎర్రరంగులో ఉన్న ఫొటోను అప్‌లోడ్‌ చేసి నలుగురు కూలీలకు హాజరు వేశారు. వట్టిఖమ్మంపహడ్‌లో ముగ్గురు మాత్రమే కనబడే ఫొటోను అప్‌లోడ్‌ చేసి 10 మందికి హాజరువేశారు. వల్లభాపురంలో భూమి ఫొటోను తీసి ఓ వ్యక్తికి హాజరువేశారు.

తప్పులు చేస్తే చర్యలు తప్పవు : సంతో్‌షకుమార్‌, ఎంపీడీవో, చివ్వెంల

మస్టర్లలో తప్పులు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కూలీలకు హాజరు విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా, ఫొటోలు అప్‌లోడ్‌ విషయం లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ జరిగినా చర్యలు తప్పవు.

Updated Date - Apr 03 , 2024 | 12:10 AM