Share News

అతిఽథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:40 AM

సంస్థాన నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల పాఠశాలలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ పి.వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

అతిఽథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సంస్థాన నారాయణపురం, జూన 3: సంస్థాన నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల పాఠశాలలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ పి.వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంగ్లంలో బోధించేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు కావాలని పేర్కొన్నారు. ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శ్రాస్తం, తెలుగు, హిందీ, నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు)కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పీజీ, డ్రిగీ, బీఈడీ విద్యార్హతలు కలిగిన వారు ఈనెల 10 వరకు అర్హత అనుభవం పత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated Date - Jun 04 , 2024 | 12:40 AM