Share News

ఆర్‌ఎంపీ, పీఎంపీ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు

ABN , Publish Date - May 30 , 2024 | 12:16 AM

జిల్లాలోని పలు చోట్ల రాష్ట్ర వైద్య మండలి సభ్యులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మునుగోడు, చండూరు, కొండమల్లేపల్లిలోని పలు ప్రా థమిక చికిత్సా కేంద్రాల్లో ఈ బృందం తనిఖీలు నిర్వహించింది.

ఆర్‌ఎంపీ, పీఎంపీ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు

తనిఖీల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య మండలి సభ్యులు

నల్లగొండ, చండూరు, మునుగోడు, మే 29: జిల్లాలోని పలు చోట్ల రాష్ట్ర వైద్య మండలి సభ్యులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మునుగోడు, చండూరు, కొండమల్లేపల్లిలోని పలు ప్రా థమిక చికిత్సా కేంద్రాల్లో ఈ బృందం తనిఖీలు నిర్వహించింది. వైద్యపరంగా ఎలాంటి అర్హత లేకుండా వచ్చిరాని వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ క్లినిక్‌లు నడుపుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చట్టపర చర్య లు తప్పవని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు, లీగల్‌ యాంటీ ఎంక్వైరీ మెంబర్‌ డాక్టర్‌ ఎం.శేషుమాధవ్‌ హెచ్చరించారు. ఆర్‌ఎంపీ బోర్డులు పెట్టుకుని ఎంబీబీఎస్‌ స్థాయి పరిధి దాటి వైద్యం చేస్తున్న 58మంది నకిలీ వైద్యులపై ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీరంతా ఎలాంటి అర్హత లేకుండా విచ్చలవిడి గా యాంటీబయాటిక్‌, స్టెరాయిడ్‌ ఇంజక్షన్‌తో పాటు కొన్ని క్లినిక్‌లలో గర్భ విచ్ఛిత్తి టాబ్లెట్లు ఇవ్వడంతో పాటు ఆపరేషన్‌ థియేటర్లు, రహ స్య గర్భవిచ్ఛితి పరికరాలను గుర్తించినట్లు తెలంగాణ వైద్య మండలి సభ్యులు తెలిపారు. తనిఖీల్లో తెలంగాణ వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, లీగల్‌ యాంటీ ఎంక్వైరీ బృందం సభ్యులు ఎఫ్‌ఎంజీ చైర్మన్‌ డా.శ్రీకాంత్‌, పబ్లిక్‌ రిలేషన్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ నరేష్‌కుమార్‌, రవికుమార్‌, విష్ణు, ఇమ్రాన్‌ ఆలీ, పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:16 AM